సాక్షిలైఫ్: ఆరోగ్యాన్ని మించిన సంపద మరొకటి లేదని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్యదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలంటే మనం తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శరీరంలోని పొట్ట, కళ్లు, ఎముకలు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ద్వారా మీరు ఎలాంటి అనారోగ్య సమస్య లేకుండా హ్యాపీగా ఉండవచ్చు.
ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుతారు.హెల్తీ గా ఉండాలంటే తప్పనిసరిగా కొన్నిరకాల జాగ్రత్తలు పాటించాలి. అందులోభాగంగా ఆరోగ్యకరమైన ఆహరం తీసుకోవాలి.. ఆరోగ్యంగా ఉండటానికి,సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. మానసికంగా,శారీరకంగా ఆరోగ్యంగా ఉందలంటే..? హెల్తీ ఫుడ్ ను ఎంచుకోండి. ప్రకృతి మనకు సహజ సిద్ధంగా అనేక రకాల కాయలు,పండ్లు, కూరగాయలు అందిస్తోంది. వీటిని తినడం వల్ల మన శరీరాన్ని వాతావరణానికి అనుగుణంగా మార్చుకోవచ్చు. అలాంటి కొన్ని సూపర్ ఫుడ్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.
గట్ హెల్త్..
గట్ హెల్త్..కు సంబంధిత సమస్యలకు దూరంగా ఉండటం ద్వారా మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇందు కోసం ఆకుకూరలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ప్రత్యేకంగా ఆహారంలో చేర్చుకోవాలి. ఇది కాకుండా, ప్రోబయోటిక్ ఆహారాలు కూడా మంచివి, ముఖ్యంగా పెరుగు. సీజనల్ పండ్లను కూడా తప్పకుండా తినాలి. అవకాడో వంటి కొన్ని ప్రత్యేక పండ్లలో అనేక రకాల విటమిన్లు , మినరల్స్ ఉంటాయి. ఇతర పండ్లతో పోలిస్తే ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్నా మంచి కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది పొటాషియం, యాంటీఆక్సిడెంట్లకు కూడా మంచి మూలం. ఇవే కాకుండా బొప్పాయి, కీరదోస, దోసకాయ, పుచ్చకాయ వంటి అనేక పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి తీసుకోవడం ద్వారా హెల్తీగా ఉండొచ్చు.
చర్మం..
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, మీ ఆహారంలో టొమాటోను ఖచ్చితంగా చేర్చుకోండి, ఎందుకంటే ఇందులో లైకోపీన్, యాంటీ-ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ హానికరమైన ప్రభావాలను తగ్గిస్తాయి. అంతే కాకుండా విటమిన్ ఏ అధికంగా ఉండే ఆహార పదార్థాలు చర్మానికి మేలు చేస్తాయి. ఇందుకోసం క్యారెట్, గుమ్మడి, బొప్పాయి తినాలి.
ఎముకలు..
వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీన మవుతాయి. కాబట్టి ఎముకల పటిష్టతపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. ఎముకలు దృఢంగా ఉన్నంత వరకు శరీరం బలంగా ఉంటుంది. యువతకు ప్రతిరోజూ 700 mg కాల్షియం అవసరం. దీని కోసం, పాలు, చీజ్, ఇతర పాల ఉత్పత్తులతో పాటు బ్రకోలీ, క్యాబేజీ, బెండకాయ వంటి ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోండి. సోయా, బీన్స్ కూడా ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?
కళ్లు..
డిజిటల్ ప్రపంచంలో స్క్రీన్‌కు దూరంగా ఉండటం కొంచెం కష్టమే, కానీ మన కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి మనం ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు. క్యారెట్‌లో తగినంత పరిమాణంలో బీటా కెరోటిన్ ఉంటుంది, ఇది శరీరంలో విటమిన్ "ఏ"ని అందిస్తుంది. ఈ పోషకాహారాన్ని కళ్ళకు చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. రేచీకటిని నివారిస్తుంది. బచ్చలికూరలో లుటిన్, జియాక్సంతిన్ వంటి కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
ఇది కూడా చదవండి.. ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే కారకాలు
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com