వేసవికాలంలో చలువచేసే మసాలా దినుసులు ఇవే..

సాక్షి లైఫ్ : ఎండలు మండుతున్న నేపథ్యంలో ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో కొన్నిరకాల మార్పులు తప్పనిసరిగా చేసుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యల బారీన పడాల్సి వస్తుంది. ఆహారంలో మనం తీసుకునే మసాలా దినుసుల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. కడుపులో మంటను నివారించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో కొన్నిరకాల సుగంధ ద్రవ్యాలు మాత్రమే కీలక పాత్ర పోషిస్తాయి. కానీ అవన్నీ వేసవి కాలంలో తగినవి కావు. కొన్ని సుగంధ ద్రవ్యాలు గట్ పనితీరుకు అంతరాయం కలిగిస్తాయి. దీని కారణంగా  జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి సమ్మర్ సీజన్ లో ఏ మసాలా దినుసులు చేర్చాలో తెలుసుకుందాం..  

ఇది కూడా చదవండి..  ఎండాకాలంలో ఈ ఫుడ్స్ ఆరోగ్యానికి హానికలిగిస్తాయని మీకు తెలుసా..? 

సమ్మర్ లో వాడదగిన మసాలా దినుసులు..   

జీలకర్ర.. 

 జీలకర్ర వేసవికాలంలో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడడమేకాకుండా, శరీరాన్ని చల్లబరుస్తుంది. దీనిని సాధారణంగా వివిధ భారతీయ వంటలలో ఉపయోగిస్తారు. మీ ఆహారంలో జీలకర్రను చేర్చుకోవడం వల్ల జీర్ణవ్యవస్థలో అసౌకర్యాన్ని తగ్గించి, వేసవిలో మొత్తం గట్ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది.

 పుదీనా.. 

ఉష్ణోగ్రతలు పెరిగే కాలంలో హెల్త్ ను పర్ఫెక్ట్ కాపాడే వాటిల్లో ఒకటి పుదీనా. ఇది మంచి రుచిని కలిగి ఉంటుంది.  కడుపుని శాంతపరచడానికి, ఆమ్లతను తగ్గించడానికి, అజీర్ణాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. సలాడ్లు, పానీయాలు లేదా పెరుగులో తాజా పుదీనా ఆకులను జోడించడం వల్ల వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.

ఇది కూడా చదవండి.. కస్టమర్లను తప్పుదారి పట్టించవద్దని ఈ-కామర్స్ కంపెనీలను హెచ్చరించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ 

 ఇది కూడా చదవండి.. ఆటిజం ఉన్న చిన్నారులతో ఎలా ఉండాలి..?  

  కొత్తిమీర.. 

 కొత్తిమీర భారతీయ వంటలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇది  శీతలీకరణ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. మీ భోజనంలో ధనియాల పొడి లేదా తాజా కొత్తిమీర ఆకులను చేర్చడం వల్ల వేసవికాలంలో రుచితోపాటు పేగు ఆరోగ్యాన్ని(గట్ హెల్త్)ను మెరుగుపరుస్తుంది.


సోంపు గింజలు..  

జీర్ణక్రియ కోసం ఈ గింజలను సాధారణంగా భోజనం తర్వాత తీసుకుంటారు. ఇవి శరీరానికి చలువ చేస్తాయి. జీర్ణ సంబంధిత సమస్యలు , కడుపు ఉబ్బరం, గ్యాస్‌ వంటి వాటిని తగ్గించడంలో సహాయపడతాయి. భోజనం తర్వాత కొన్ని సోపు గింజలను నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడడమేకాకుండా, వేసవికాలంలో అజీర్తి సమస్యలను నివారిస్తుంది.

 ఏలకులు..  

ఏలకులు.. తీపి, రుచికరమైన వంటకాలకు ప్రత్యేకమైన రుచిని జోడిస్తాయి. ఇవి చలువ లక్షణాలను కలిగి ఉంటాయి. ఎసిడిటీ, ఉబ్బరం ,అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతాయి. లస్సీ లేదా హెర్బల్ టీ వంటి పానీయాలకు ఏలకుల పొడిని జోడించడం వల్ల వేసవికాలంలో జీర్ణ సమస్యలు తలెత్తవు. 

ఇది కూడా చదవండి.. అనోరెక్సియా నెర్వోసా అంటే..? లక్షణాలు-కారణాలు..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : healthy-food summer-health-tips summer-season summer summer-health summer-tips cool summer-alert summer-heat spices

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com