సాక్షి లైఫ్ : ఓ బాలుడికి ప్రపంచంలోనే అత్యంత అరుదైన కిడ్నీ వ్యాధి వచ్చింది. సరైన సమయానికి వ్యాధిని గుర్తించడంతో అతనికి అవసరమైన చికిత్స అందించారు కర్నూలులోని కిమ్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్టు డాక్టర్ కె. అనంతరావు ఈ వ్యాధికి సంబంధించిన విశేషాలను ఆయన వెల్లడించారు.
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
లిపోప్రోటీన్ గ్లోమెరులోపతి..
కర్నూలు నగరానికి చెందిన నాలుగేళ్ల బాలుడు గత రెండు నెలలుగా కాళ్లు, ముఖం వాపుతో ఇబ్బంది పడుతున్నాడని ఆస్పత్రికి తీసుకొచ్చారు. కొన్ని పరీక్షలు చేయగా మూత్రంలో ప్రోటీన్ లీకేజి కనిపించింది. దాంతో దాన్ని నెఫ్రోటిక్ సిండ్రోమ్‌గా భావించారు. దాంతో స్టెరాయిడ్స్ చికిత్స మొదలుపెట్టారు. కానీ దానివల్ల ఫలితం లేకపోవడంతో నా వద్దకు పంపారు.
ఇది స్టైరాయిడ్‌కు లొంగని నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని డయాగ్నైజ్ చేశాము. దాంతోపాటు.. రక్తంలో కొలెస్టరాల్ స్థాయి అసాధారణంగా పెరిగిపోవడాన్ని గుర్తించాము. సీరం కొలెస్టరల్ 250 ఎంజీ/డీఎల్, ట్రైగ్లిజరైడ్స్ 950 ఎంజీ/డీఎల్ చొప్పున ఉన్నాయి. ఇది చాలా అసాధారణం. దాంతో కిడ్నీ బయాప్సీ, ఎలక్ట్రాన్ మైక్రోస్కొపీ చేసి చూడగా అప్పుడు ఆ బాలుడికి వచ్చినది ప్రపంచంలో అత్యంత అరుదైన లిపోప్రోటీన్ గ్లోమెరులోపతి అని గుర్తించామని కన్సల్టెంట్ నెఫ్రాలజిస్టు డాక్టర్ కె. అనంతరావు వెల్లడించారు.
దక్షిణ భారతదేశంలో ఇదే మొట్టమొదటి కేసు..
దక్షిణ భారతదేశంలో ఇదే మొట్టమొదటి కేసు. దాంతో జన్యుపరీక్షలు చేయగా, ఏపీఓఈ అనే జన్యువు మ్యుటేషన్ జరిగినట్లు తెలిసింది. ఇలాంటి మ్యుటేషన్ కూడా దేశంలో ఇదే మొట్టమొదటిసారి. ఈ వ్యాధిని గుర్తించడంతో ముందుగా స్టెరాయిడ్ చికిత్స ఆపేసి, లిపోప్రోటీన్ గ్లోమెరులోపతీని నియంత్రించే మందులు వాడాం. దాంతో అప్పటినుంచి క్రమంగా కొలెస్టరాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయి తగ్గడంతో పాటు మూత్రంలో ప్రోటీన్ లీకేజి కూడా ఆగింది. సరైన సమయానికి ఈ వ్యాధిని గుర్తించి, దానికి తగిన చికిత్స చేయకపోతే ఇలాంటి కేసుల్లో పూర్తిగా కిడ్నీ విఫలమయ్యే ప్రమాదం ఉంటుంది” అని డాక్టర్ అనంతరావు వివరించారు.
ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..
ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?
ఇది కూడా చదవండి..న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com