సాక్షి లైఫ్ : నాగాలాండ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు మధుమేహ బాధితుల కోసం సరికొత్త ఔషధాన్ని కనుగొన్నారు. మధుమేహంతో బాధపడుతున్న కోట్లాది మందికి గొప్ప ఆశా కిరణంగా దీనిని భావిస్తున్నారు. షుగర్ వ్యాధిలో అతి పెద్ద సమస్య అయిన గాయాలు త్వరగా మానకపోవడం, ఫలితంగా అల్సర్లు, కొన్నిసార్లు అవయవాలు తీసివేయాల్సి రావడం... వంటి ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే దిశగా మన దేశ పరిశోధకులు ఒక కీలక అడుగు వేశారు.
ఇది కూడా చదవండి..Constipation : ఇలా చేస్తే.. మలబద్ధకానికి గుడ్‌బై చెప్పేయవచ్చు..
ఇది కూడా చదవండి..Restores Eyesight : దృష్టి లోపానికి అద్భుతమైన పరిష్కారం..! కంటి చూపును ప్రసాదించే 'వైర్‌లెస్ చిప్'..
ఇది కూడా చదవండి..AQI: ఢిల్లీ-ఎన్ సిఆర్ లో ప్రమాదకర స్థాయిలను అధిగమించిన గాలి నాణ్యత సూచి..
నాగాలాండ్ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో, 'సినాపిక్ యాసిడ్' అనే సహజ సిద్ధమైన మొక్క మూలకాన్ని గుర్తించారు. ఈ సమ్మేళనం మధుమేహం వల్ల ఏర్పడిన గాయాలను వేగంగా మాన్పగలదని వారు తమ అధ్యయనం ద్వారా రుజువు చేశారు.
సినాపిక్ యాసిడ్ ఎలా పనిచేస్తుంది అంటే..?
ఈ సినాపిక్ యాసిడ్ నోటి ద్వారా తీసుకున్నప్పుడు, అది కణజాల మరమ్మత్తు (Tissue Repair), రక్తనాళాల ఏర్పాటు (Angiogenesis) మంటను (Inflammation) నియంత్రించడంలో కీలకపాత్ర పోషించే SIRT1 మార్గాన్ని (SIRT1 pathway) చురుకుగా మారుస్తుందని పరిశోధనలో తేలింది.
ప్రపంచంలోనే తొలిసారిగా..ఈ మొక్క మూలకాన్ని నోటి ద్వారా (Oral) ఇవ్వడం వల్ల మధుమేహ గాయాలు తగ్గుతాయని నిరూపించిన మొట్టమొదటి అంతర్జాతీయ అధ్యయనం ఇదే కావడం విశేషం.
ఖర్చు తక్కువ, భద్రత ఎక్కువ..
సాధారణంగా మధుమేహ గాయాలకు ఉపయోగించే మందులు పరిమితంగా పనిచేయడం, వాటికి సైడ్ ఎఫెక్టులు ఉండటం వంటి సమస్యలు ఉన్నాయి. అదే సినాపిక్ యాసిడ్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండానే ఆయా మధుమేహ గాయాలు మానే అవకాశం ఉంది.
అవయవాలను తొలగించడం (Amputation Risk): డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ వల్ల అవయవాలను తొలగించడం (Amputation) ప్రమాదాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుంది.
ఇది సహజసిద్ధమైన మొక్కల నుంచి లభించే యాంటీఆక్సిడెంట్ కాబట్టి, సురక్షితంగా, ప్రభావవంతంగా పనిచేసే అవకాశం ఉంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లోని వారికి, నిరుపేదవారికి కూడా అందుబాటులో ఉండే చౌకైన చికిత్సా మార్గాన్ని అందిస్తుంది.
ఈ పరిశోధన ఫలితాలు ప్రతిష్టాత్మకమైన 'నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్' (Nature Scientific Reports) జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. తదుపరి దశలో మనుషులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి పరిశోధకులు సిద్ధమవుతున్నారు. ఇది విజయవంతమైతే, డయాబెటిక్ చికిత్సలో కీలక పరిణామంగా భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి..పిల్లల్లో ఏకాగ్రతను పెంచే యోగాసనాలు..
ఇది కూడా చదవండి..