సాక్షి లైఫ్ : హర్యానాలోని హిసార్‌లో డెంగ్యూ కేసులు పెరుగుతున్నందున ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. ఈ కేసులు పెరగడం వల్ల చాలా మందిలో ప్లేట్‌లెట్స్ కౌంట్ పడిపోతోంది. సివిల్ హాస్పిటల్‌లోని బ్లడ్ బ్యాంక్ 50 ఎస్‌డిపి(సింగిల్ డోనర్ ప్లేట్ లెట్స్)ని సేకరించేందుకు కిట్‌ను ఆర్డర్ చేసింది. ఎస్‌డిపి డెంగ్యూ రోగులలో తగ్గిన ప్లేట్‌లెట్లను 30 నుంచి 35 వేల వరకు పెంచుతుంది. ప్రైవేట్ ల్యాబ్‌లలో ఎస్‌డిపి కిట్‌ల స్టాక్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..డెంగ్యూ అలెర్ట్ : దోమలను నివారించడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలి..
ఇది కూడా చదవండి..కాల్షియం సమృద్ధిగా లభించే ఐదు ఆహారాలు..
ఇది కూడా చదవండి..జింక్ లోపాన్ని పరిష్కరించే ఎనిమిది ఆహారాలు..
ఇది కూడా చదవండి..గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే వెల్లుల్లి..
హిసార్ లో సోమవారం కొత్తగా 8 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 243కి చేరింది. డెంగ్యూ రోగుల సంఖ్య పెరుగుతున్న కారణంగా, సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్స్ (ఎస్డీపీ)రాండమ్ డోనర్ (ఆర్దీపి) ప్లేట్‌లెట్లకు డిమాండ్ పెరుగుతోంది.
రక్తం కోసం పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, సివిల్ హాస్పిటల్‌లోని బ్లడ్ బ్యాంక్ అధికారులు 50 ఎస్డీపీలు తీయడానికి కిట్‌ను ఆర్డర్ చేశారు. ఈ కిట్‌ల ద్వారా ఎస్డీపీ తయారు అవుతుంది. ఎస్డీపీ డెంగ్యూ రోగులలో తగ్గిన ప్లేట్‌లెట్లను 30 నుంచి 35 వేల వరకు పెంచుతుంది. ఇటీవల, సివిల్ ఆసుపత్రిలో ఐదుగురు డెంగ్యూ రోగులకు ఎస్డీపీ అందించారు.
డెంగ్యూ నివారణకు ఆదేశాలు..
డెంగ్యూ నివారణకు, లార్వా వ్యతిరేక చర్యలు, ఫాగింగ్ ముమ్మరం చేయాలని సీఎంవో డాక్టర్ సప్నా గెహ్లావత్ ఆదేశాలు ఇచ్చారు. యాంటీ లార్వా యాక్టివిటీని కూడా ఆరోగ్య శాఖ నిర్వహిస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో ఫాగింగ్ చేస్తున్నారు.
దీంతోపాటు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మున్సిపల్ కార్పోరేషన్ వాహనాల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా ఇళ్ల చుట్టూ, ఇళ్ల పైకప్పులపై నీరు చేరకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ఫాగింగ్, యాంటీ లార్వా చర్యలు చేపడుతున్నారు. హిస్సార్ డిప్యూటీ సీఎంఓ డాక్టర్ సుభాష్ ఖత్రేజా మాట్లాడుతూ ఫాగింగ్, లార్వా నిరోధక చర్యలు చేపడుతున్నామన్నారు. నిలిచిన నీటిలో బ్లాక్ ఆయిల్, మందు కూడా కలుపుతున్నారు కాబట్టి దోమల లార్వా వృద్ధి చెందకుండా డెంగ్యూ వ్యాప్తి చెందకుండా నివారించవచ్చని చెప్పారు.
ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com