ఆరోగ్య శాఖ ఉద్యోగాల విషయంలో మోసపోవద్దు : మంత్రి దామోదర రాజ నర్సింహ

సాక్షి లైఫ్ : ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని నిరుద్యోగులకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉద్యోగాల భర్తీ పారదర్శకతపై మంత్రి పలు విషయాలు ప్రస్తావించారు. 

-ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని మంత్రి చెప్పారు.
-మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా గత 11 నెలల్లో 7,000 పైచిలుకు పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు.
- ప్రస్తుతం 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, 732 ఫార్మసిస్ట్ (గ్రేడ్ 2), 1,284 ల్యాబ్ టెక్నీషియన్, 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 156 ఆయుష్ మెడికల్ ఆఫీసర్, 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎంఎన్‌జే), 24 ఫుడ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

ఇది కూడా చదవండి..డైట్‌ మధుమేహ నిర్వహణకు ఎలా సహాయపడుతుంది..?

ఇది కూడా చదవండి..డయాబిటిస్ రిస్క్ ఎలాంటివాళ్లకు ఎక్కువ..?

ఇది కూడా చదవండి..హెపటైటిస్ బి, సి ప్రాణాంతకమా..?

ఇది కూడా చదవండి..నూతన అధ్యయనం : పసుపులో విషపూరిత పదార్థాలు..

రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు:
-భవిష్యత్తులో మరిన్ని పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
- విద్యార్హతలు, రాతపరీక్షలు, ఇతర నిబంధనల ప్రకారం పూర్తిగా పారదర్శకతతో ఈ పోస్టుల భర్తీ జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.

దళారుల మోసాలపై హెచ్చరిక.. 

-ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని, అలాంటి సమాచారం పోలీసులకు అందించి ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు.
-మోసం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
-మోసగాళ్లపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు సమాచారం అందించాలని ప్రజలను  కోరారు.

జాగ్రత్తలు అవసరం.. 

-నిరుద్యోగులు ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని నేరుగా అధికారిక వెబ్ సైట్ల నుంచే పొందాలని, ఎలాంటి మధ్యవర్తులను నమ్మవద్దని మంత్రి దామోదర రాజ నర్సింహ సూచించారు.

- ప్రజలెవ్వరూ మోసపోకుండా తమ హక్కులు కాపాడుకోవాలని, ఆరోగ్య శాఖ యంత్రాంగంపై నమ్మకం ఉంచాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.  

ఇది కూడా చదవండి..ఆటిజం థెరపీ ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉండగలుగుతారా..?

ఇది కూడా చదవండి..పచ్చకామెర్లు ప్రాణాలకు ప్రమాదమా..?

ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : health-news-updates health-news telangana-state telangana-state-government telangana-state-health-minister damodar-rajanarsimha crime-news damodarrajanarsimha
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com