సాక్షి లైఫ్ : అమెరికా వీసా (US Visa) కోసం దరఖాస్తు చేసుకునే విదేశీయులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఇకపై దీర్ఘకాలిక ఆనారోగ్య సమస్యలతో బాధపడేవారికి వీసా నిరాకరించేందుకు వీలుగా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా ఊబకాయం (Obesity), మధుమేహం (Diabetes), అధిక రక్తపోటు (BP) వంటి సమస్యలు ఉన్నవారి వీసా దరఖాస్తులను తిరస్కరించే అధికారాన్ని కాన్సులర్ అధికారులకు కల్పించింది.
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
కొత్త నిబంధనలకు ప్రధాన కారణం ఏంటి..?
యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాన్సులర్ కార్యాలయాలకు పంపిన తాజా ఆదేశాల ప్రకారం.. వీసా దరఖాస్తుదారుల ఆరోగ్యాన్ని, వారిపై ఆధారపడే కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిని మరింత లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది.
'పబ్లిక్ ఛార్జ్' రూల్..
ఆరోగ్యం బాగోలేని వ్యక్తులు అమెరికా వచ్చాక ప్రభుత్వ సహాయం (Public Benefits)పై ఆధారపడాల్సి వస్తే, వారు "పబ్లిక్ ఛార్జ్' (Public Charge)"గా పరిగణిస్తారు. అంటే, అలాంటి వారి కారణంగా అమెరికా వనరులపై ఆర్ధిక భారం పెరుగుతుందని అందుకోసమే తీవ్రమైన వ్యాధులున్న వారిని రానివ్వకుండా కొత్తరూల్స్ అమలు చేస్తున్నారు.
లక్షల డాలర్ల ఖర్చు..
గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్, మధుమేహం, నాడీ సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలు వంటి వాటి చికిత్సకు లక్షల డాలర్లు ఖర్చవుతాయని, అంత ఖర్చును దరఖాస్తుదారుడే భరించగలరా లేదా అని వీసా అధికారులు నిర్ధారించిన తరువాతనే వాళ్ళకు వీసా అందిస్తారు.
ఊబకాయం కూడా ఒక కారణమే..
ఊబకాయం (Obesity) వంటి సమస్యలు ఉన్నవారికి ఆస్తమా, స్లీప్ అప్నియా (Sleep Apnea), హై బీపీ వంటి ఇతర సమస్యలు వచ్చి వైద్య ఖర్చులు పెరగవచ్చు. కాబట్టి, ఊబకాయాన్ని కూడా వీసా తిరస్కరణకు కారణమయ్యే అంశాల జాబితాలో చేర్చారు. దరఖాస్తుదారుడు తన వ్యాధుల చికిత్సకు అయ్యే ఖర్చులను అమెరికా ప్రభుత్వం సహాయం లేకుండా సొంతంగా తన జీవితకాలం అంతా భరించగలడా అనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తారు.
కుటుంబ సభ్యుల ఆరోగ్యం..
దరఖాస్తుదారుడిపై ఆధారపడిన (Dependents) కుటుంబ సభ్యులు అంటే పిల్లలు లేదా వృద్ధులు ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు లేదా వైకల్యాలు ఉన్నా, వాటి చికిత్స ఖర్చుల కారణంగా దరఖాస్తుదారుడు ఉద్యోగంపై దృష్టి పెట్టలేడని భావిస్తే, వీసా నిరాకరించవచ్చు.
భారతీయులపై తీవ్ర ప్రభావం..
ఈ కొత్త నిబంధనలు విదేశీ వలసదారులపై, ముఖ్యంగా భారతీయులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యలు ఎక్కువ మందిలో కనిపిస్తున్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల H-1B, గ్రీన్ కార్డ్ దరఖాస్తు ప్రక్రియ మరింత కష్టతరం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు వీసా కోసం దరఖాస్తు చేసేటప్పుడు.. తమ దీర్ఘకాలిక వైద్య ఖర్చులను భరించడానికి తగినంత ఆర్థిక స్థోమత, పూర్తి స్థాయి ప్రైవేట్ ఆరోగ్య బీమా (Private Health Insurance) ఉన్నట్లు ఆధారాలు చూపించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి..పంచదార, తేనె, మాంక్ ఫ్రూట్ లలో.. ఆరోగ్యకరమైన స్వీటెనర్ ఏది..?
ఇది కూడా చదవండి..New study : బోన్ స్ట్రెంత్ విషయంలో గట్ హెల్త్ పాత్ర కీలకం..
ఇది కూడా చదవండి..ఏట్రియల్ కార్డియోమయోపతి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com