Anti-Aging Injections Declared Illegal : యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లు చట్టవిరుద్ధం: సీడీఎస్‌సీఓ సంచలన ఆదేశాలు..!
సాక్షి లైఫ్ : అందంగా, యవ్వనంగా కనిపించాలనే తాపత్రయంతో ఈ మధ్యకాలంలో చాలామంది 'స్కిన్ బూస్టర్లు', 'గ్లో షాట్లు' అంటే..?యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, స్థానిక క్లినిక్‌లు, వెల్‌నెస్ సెంటర్లలో విరివిగా జరుగుతున్న ఇటువంటి ఇంజెక్టబుల్ విధానాలపై కేంద్ర ప్రభుత్వ ఔషధ నియంత్రణ సంస్థ (CDSCO) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ సౌందర్య సాధనాన్ని (Cosmetic Product) ఇంజెక్షన్ రూపంలో ఉపయోగించడానికి అనుమతి లేదని స్పష్టం చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
1940 నాటి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం కాస్మెటిక్ ఉత్పత్తులను ఇంజెక్షన్లుగా వాడటం చట్టవిరుద్ధమని సీడీఎస్‌సీఓ నోటీసుల్లో పేర్కొంది. ఈ నిర్ణయంతో క్లినిక్‌లు, బ్యూటీ పార్లర్లలో సాగుతున్న కాస్మెటిక్ ఇంజెక్షన్ల వ్యాపారానికి గట్టి బ్రేక్ పడనుంది.
కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..?
బాహ్య వినియోగానికే మాత్రమే..
చట్టం ప్రకారం కాస్మెటిక్ ఉత్పత్తులు కేవలం చర్మంపై రుద్దడానికి, చల్లడానికి లేదా రాసుకోవడానికి మాత్రమే ఉద్దేశించినవి. వీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంజెక్షన్ రూపంలో శరీరంలోకి పంపకూడదు.
ఆసుపత్రుల్లోనే అనుమతి..
ఒకవేళ వైద్యపరమైన ఇంజెక్టబుల్ ఉత్పత్తులను ఉపయోగించాల్సి వస్తే, వాటిని కేవలం అర్హత కలిగిన ఆసుపత్రి వాతావరణంలో మాత్రమే నిర్వహించాలి.
తప్పుడు ప్రచారాలపై కఠిన చర్యలు..
చర్మ వ్యాధులను నయం చేస్తామంటూ కాస్మెటిక్ ఉత్పత్తులను విక్రయిస్తే కఠినమైన ఫార్మాస్యూటికల్ నిబంధనలు వర్తిస్తాయి. ఉత్పత్తుల సామర్థ్యంపై తప్పుడు లేదా తప్పుదోవ పట్టించే ప్రచారం చేసే క్లినిక్‌లపై కాస్మెటిక్స్ రూల్స్ 2020 ప్రకారం చర్యలు ఉంటాయి.
తనిఖీలకు లైన్ క్లియర్..
సీడీఎస్‌సీఓ తాజా మార్గదర్శకాలతో తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (TGDCA) కి పూర్తి అధికారాలు లభించాయి. నిబంధనలు ఉల్లంఘించే వెల్‌నెస్ సెంటర్లపై దాడులు చేసి, సామగ్రిని సీజ్ చేసేందుకు వీలు కలగనుంది.
వైద్యారోగ్య శాఖ హెచ్చరిక..
హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోని క్లినిక్‌లు, వెల్‌నెస్ సెంటర్లు కేవలం 'సౌందర్య సాధనాలు' (Cosmetics) 'మెడికల్-గ్రేడ్ ఇంజెక్టబుల్ డ్రగ్స్' మధ్య వ్యత్యాసాన్ని దాచిపెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు సీనియర్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రులు కాని కేంద్రాలలో ఇటువంటి ప్రయోగాలు చేయడం వల్ల ప్రజల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఫిర్యాదు చేయండిలా..!
సాధారణ ప్రజలు ఇటువంటి మోసపూరిత ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అక్రమంగా యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లు ఇచ్చే కేంద్రాల సమాచారాన్ని అధికారులకు అందించి విజిల్‌బ్లోయర్‌లుగా మారాలని సీడీఎస్‌సీఓ కోరింది.
ఫిర్యాదు చేయడానికి సంప్రదించాల్సిన వివరాలు: ఇ-మెయిల్ ఐడీ: cosmetics@cdsco.nic.in, TGDCA టోల్ ఫ్రీ నంబర్: 18005996969, అందాల వేటలో పడి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవద్దని, లైసెన్స్ లేని నిపుణుల వద్ద ఇటువంటి చికిత్సలు చేయించుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?
ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..?
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
