Ayushman Bharat Effect : ఆరోగ్య రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. మాతా శిశు సంరక్షణలో కీలక మార్పులు.

సాక్షి లైఫ్ : దేశవ్యాప్తంగా మాతా శిశు ఆరోగ్య సంరక్షణలో భారత్ గణనీయమైన ప్రగతిని సాధిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డా వెల్లడించారు. ముఖ్యంగా గర్భిణీలకు ఆసుపత్రుల్లో సురక్షిత ప్రసవాలు (Institutional Deliveries) అందించే ప్రక్రియ వేగవంతమైందని ఆయన పేర్కొన్నారు. గతంలో 79 శాతంగా ఉన్న సంస్థాగత ప్రసవాల రేటు ప్రస్తుతం 89 శాతానికి చేరుకుంది. ఆశా (ASHA) కార్యకర్తలు, ఇతర ఫ్రంట్‌లైన్ ఆరోగ్య సిబ్బంది నిరంతర కృషి వల్లే ఇది సాధ్యమైందని మంత్రి కొనియాడారు.

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

 

ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరగడం వల్ల మాతృ మరణాల రేటు (MMR) గణనీయంగా తగ్గింది. గతంలో ప్రతి లక్ష సజీవ జననాలకు 130గా ఉన్న మాతృ మరణాల సంఖ్య, ప్రస్తుతం 88కి తగ్గిందని ఆయన వివరించారు.

శిశు మరణాల రేటు (IMR) కూడా ప్రతి వెయ్యి మందికి 39 నుంచి 27కు తగ్గడం దేశ ఆరోగ్య రంగ పురోగతికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. ఐదేళ్ల లోపు పిల్లల మరణాల రేటులో భారత్ 42 శాతం తగ్గుదలని నమోదు చేసి, ప్రపంచ సగటు (14 శాతం) కంటే మెరుగ్గా నిలిచిందని తెలిపారు.

వైద్య విద్యలో విప్లవాత్మక మార్పులు.. 

గత 11 ఏళ్లలో దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల సంఖ్య భారీగా పెరిగినట్లు జె.పి. నడ్డా తెలిపారు. 2014లో 387గా ఉన్న వైద్య కళాశాలల సంఖ్య ప్రస్తుతం 819కి చేరింది. ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 51,000 నుంచి 1,29,000కు పెరిగింది. పీజీ (PG) సీట్లు కూడా 31,000 నుంచి 78,000కు చేరుకున్నాయి. రాబోయే ఐదేళ్లలో అదనంగా మరో 75,000 వైద్య సీట్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

పిపిపి (PPP) విధానంలో సరికొత్త ప్రయోగం.. 

మధ్యప్రదేశ్‌లోని ధార్,బేతుల్ జిల్లాల్లో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) మోడల్‌లో నూతన వైద్య కళాశాలలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఇవి దేశంలోనే ఈ విధానంలో నడిచే తొలి మెడికల్ కాలేజీలని, వీటి వల్ల మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని జేపీ నడ్డా ఆకాంక్షించారు.

 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : ayush-department infant normal-delivery health-minister-jp-nadda jp-nadda ayushman-bharat labor-and-delivery j.p.-nadda mortality-risk
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com