Bulimia Nervosa : అతిగా తిని.. ఆపై మదనపడుతున్నారా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పని ఒత్తిడిలో పడి సమయానికి తినకపోవడం, ఆ తర్వాత ఒకేసారి అతిగా తినేయడం (overeating) సాధారణంగా జరిగేదే. కానీ, ఇలా అతిగా తిన్న ప్రతిసారీ బరువు పెరిగిపోతామనే భయం (feelings of guilt) కలగడం, వెంటనే వాంతి చేసుకోవాలని ప్రయత్నించడం లాంటివి చేస్తే అప్రమత్తం కావాల్సిందే. ఇది 'బులిమియా నర్వోసా' (Bulimia Nervosa) అనే తీవ్రమైన మానసిక ఆహార రుగ్మతకు (eating disorder) సంకేతం కావచ్చు.

 

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

ప్రధాన లక్షణాలు ఏమిటి.. ?

బులిమియా నర్వోసా బారిన పడిన వారిలో ఈ కింది లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. తక్కువ సమయంలోనే అధిక మొత్తంలో ఆహారాన్ని తినేయడం. తింటున్నప్పుడు తమపై తమకు ఎలాంటి నియంత్రణ లేకపోవడం. బరువు పెరుగుతామనే తీవ్రమైన భయంతో కావాలని వాంతులు చేసుకోవడం.

తిన్న దాన్ని కరిగించేందుకు అతిగా వ్యాయామం చేయడం లేదా ఎక్కువ సమయం పస్తులుండటం.ఇతరులకు కనిపించకుండా రహస్యంగా లేదా ఒంటరిగా భోజనం చేయడం.తమ శరీర ఆకృతి, బరువు గురించి ఎప్పుడూ విపరీతంగా ఆందోళన చెందడం.

ఈ సమస్య ఎందుకు వస్తుంది..?

తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, ఆత్మవిశ్వాసం లోపించడం దీనికి ప్రధాన కారణాలు. సోషల్ మీడియాలో కనిపించే జీరో సైజ్ లేదా పర్ఫెక్ట్ బాడీ ఇమేజ్ కోసం ఆరాటపడటం, కుటుంబ సమస్యలు, భావోద్వేగాల అసమతుల్యత కూడా ఈ మానసిక రుగ్మతకు దారితీస్తాయి. ఇది కేవలం ఆహారపు అలవాటు మాత్రమే కాదు, తమ శరీరం పట్ల ఉన్న ఒక తప్పుడు అవగాహన.

ఆరోగ్యంపై దుష్ప్రభావం..

ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. తరచుగా వాంతులు చేసుకోవడం వల్ల శరీరంలో నీటిశాతం, ముఖ్యమైన ఖనిజాల (minerals) కొరత ఏర్పడుతుంది. అవయవాలపై ప్రభావం..పదే పదే వాంతులు చేసుకోవడం వల్ల దంతాలు, గొంతు దెబ్బతింటాయి.  జీర్ణకోశ సమస్యలు, హృద్రోగాలు, మరియు తీవ్రమైన డిప్రెషన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి..?

మీలో లేదా మీ ఆత్మీయుల్లో ఈ లక్షణాలు పదే పదే కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మానసిక వైద్యులను (సైకియాట్రిస్ట్) లేదా సైకాలజిస్ట్‌(psychiatrist or psychologist)ను సంప్రదించాలి. సరైన కౌన్సెలింగ్, సమతుల్య ఆహారం, కుటుంబ సభ్యుల మద్దతుతో ఈ సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు.

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి..కాలేయం దెబ్బతింటుందని సూచించే సంకేతాలు ఇవే..  

ఇది కూడా చదవండి..హెపటైటిస్ ఏ సమస్య వర్షాకాలంలోనే పెరగడానికి కారణాలు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.