గర్భధారణ సమయంలో డిప్రెషన్ ప్రభావం శిశువుపై పడుతుందా..?

షేర్ చేయండి:
గర్భధారణ సమయంలో డిప్రెషన్ ప్రభావం శిశువుపై పడుతుందా..?

సాక్షి లైఫ్ : గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. అటువంటి పరిస్థితిలో వారు తమ కుటుంబం లేదా జీవిత భాగస్వామి నుంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పొందకపోతే, అది పుట్టబోయే బిడ్డల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే డిప్రెషన్ కారణంగా కడుపులో ఉన్న మగబిడ్డ కంటే ఆడపిల్లపైనే ఎక్కువగా ప్రభావం పడుతుందని ఇటీవల జరిగిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

ఇది కూడా చదవండి..గట్ ఫ్రెండ్లీగా ఉండే హైప్రోటీన్ ఆహారాలు ఏవి..?

ఇది కూడా చదవండి.. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

 ఇది కూడా చదవండి.. శరీరంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ ఎంత ఉండాలి..? 

డిప్రెషన్ ప్రభావం..


ఇటీవల ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ బిహేవియరల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో "గర్భధారణ సమయంలో డిప్రెషన్ ప్రభావం శిశువుపై ఎంతమేర పడుతుంది..? అనేదానిపై అధ్యయనం చేశారు పరిశోధకులు. ఈ అధ్యయనంలో ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే డిప్రెషన్ కడుపులో ఉన్న మగబిడ్డ కంటే ఆడపిల్లలపైనే ఎక్కువగా ప్రభావం చేస్తుందని వెల్లడైంది.

207 మంది గర్భిణులపై జరిపిన అధ్యయనంలో ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన అనేక షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. గర్భధారణ సమయంలో డిప్రెషన్‌తో బాధపడే మహిళల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం తక్కువ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 ప్రెగ్నెన్సీలో డిప్రెషన్: ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి డిప్రెషన్‌కు గురైతే, అది పుట్టబోయే కుమార్తెపై ప్రభావం తీవ్రంగా చూపుతుందట. గర్భధారణ సమయంలో తల్లికి డిప్రెషన్ లేదా మరేదైనా మానసిక సమస్య ఉంటే, అది కడుపులో ఉన్న నవజాత శిశువుపై కూడా ప్రభావంకనిపిస్తుందని  పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

 
ఆడపిల్లలకు తన తల్లి నుంచి పుట్టుకతో అనేక లక్షణాలు సంక్రమిస్తాయని పెద్దలు చెబుతుంటారు. ఈ విషయం ఇప్పుడు ఈ సరికొత్త పరిశోధనలో నిరూపణ అయ్యింది. ఈ తాజా పరిశోధనలో గర్భధారణ సమయంలో తల్లి డిప్రెషన్‌కు గురైతే, పుట్టిన కుమార్తె వయస్సు తర్వాత నిద్రలేమి సమస్యతో బాధపడుతుందని తేలింది. 10 సంవత్సరాలలో ప్రమాదం 70 శాతం వరకు పెరుగుతుందట. అయితే మగపిల్లలపై ఈ ప్రభావం అంతగా ఉండదని వెల్లడైంది. 


ప్రెగ్నెన్సీ సమయంలో డిప్రెషన్‌తో బాధపడే ఆడవాళ్ల కొడుకుల్లో పదేళ్ల వయసులో నిద్రలేమి ప్రభావం కనిపించడం లేదని.. అంటే అబ్బాయిలు దీని బారిన పడరని పరిశోధనలో తేలింది. 2006 ఇజ్రాయెల్-లెబనాన్ యుద్ధంలో గర్భిణీ స్త్రీలు, పిల్లలపై డిప్రెషన్ ప్రభావాన్ని గుర్తించడానికి 207 మంది తల్లులను అధ్యయనం చేసినట్లు పరిశోధకురాలు ఎమ్మా బోల్హుయిస్ చెప్పారు. యుద్ధం కారణంగా, ఈ మహిళలు తమ కుటుంబాల్లో  గొడవలు, సామాజిక ఉద్రిక్తత కారణంగా డిప్రషన్ కు గురయ్యారు.

ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..

ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?

ఇది కూడా చదవండి..న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్‌ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే.. 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.