National Stress Audit : నగరవాసులపై 'ఒత్తిడి' పంజా..నేషనల్ స్ట్రెస్ ఆడిట్'లో విస్తుపోయే నిజాలు..
సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలి, ఉరుకుల పరుగుల జీవితం నగరవాసులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది. హిమాలయ వెల్‌నెస్ కంపెనీ దేశవ్యాప్తంగా 75 వేల మందిపై నిర్వహించిన 'నేషనల్ స్ట్రెస్ ఆడిట్'లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఒత్తిడి అనేది ఇప్పుడు కేవలం అప్పుడప్పుడు వచ్చే సమస్య కాదని, అది పట్టణ ప్రాంతాల్లో ఒక జీవనశైలి రుగ్మతగా మారిందని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా ఐటీ హబ్ బెంగళూరులో 22 శాతం మంది 'అత్యంత తీవ్రమైన ఒత్తిడి' (Very High Stress) ఎదుర్కొంటున్నట్లు తేలింది.
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
సర్వేలోని కీలక అంశాలు..
అతిగా ఆలోచించడం..89 శాతం మంది తాము అతిగా ఆలోచిస్తున్నా మని (Overthinking) అంగీకరించగా, అందులో 83 శాతం మందికి ఇది అలవాటుగా మారింది. 63 శాతం మంది తమ జీవితం ఆశించిన రీతిలో సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ పనుల్లో 53 శాతం మంది శారీరక, మానసిక అలసట (Burnout) ఎదుర్కొంటున్నారు. 52 శాతం మంది తరచూ కోపం, ఆందోళనకు గురవుతున్నారు.
18 ఏళ్ల నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సు గల యువతలో ఒత్తిడి స్థాయిలు అత్యధికంగా ఉన్నాయి. 18-25 ఏళ్ల వయస్సు గల మహిళల్లో దాదాపు 45 శాతం మంది తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు సర్వే వెల్లడించింది.
కారణాలు ఏమిటి..?
కోవిడ్ తర్వాతి కాలంలో మానసిక సమస్యలతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. సుదీర్ఘ పని వేళలు, ట్రాఫిక్ ఇబ్బందులు, ఉద్యోగ భద్రత లేకపోవడం, ఇంటర్నెట్ వ్యసనం ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో ఇతరులతో పోల్చుకోవడం వల్ల యువతలో అభద్రతా భావం పెరుగుతోందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.
ప్రభావం..
తీవ్ర ఒత్తిడి వల్ల కేవలం నిద్రలేమి మాత్రమే కాకుండా.. దీర్ఘకాలిక తలనొప్పి, జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా త్వరగా ఫలితాలు సాధించాలనే తపన, పని ఒత్తిడి వల్ల 23-35 ఏళ్ల మధ్య వయస్కులు త్వరగా అలసిపోతున్నారు (Burnout).
ఒత్తిడిని జయించడానికి చిన్నపాటి మార్పులు అవసరమని క్లినికల్ సైకాలజిస్టులు సూచిస్తున్నారు.
ప్రతిరోజూ కనీసం 45 నిమిషాల పాటు నడక లేదా వ్యాయామం చేయాలి.
సరైన సమయానికి నిద్రపోవడం, పనికి-వ్యక్తిగత జీవితానికి మధ్య స్పష్టమైన విభజన ఉండాలి.
స్క్రీన్ టైమ్ ,మొబైల్ వినియోగం తగ్గించాలి.
కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడపడం, హాబీలను కొనసాగించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
సమస్య తీవ్రంగా ఉంటే నికోచించకుండా నిపుణుల సలహా తీసుకోవాలి.
ఒత్తిడి అనేది ఇప్పుడు కేవలం చిరాకుగా అనిపించే అంశం కాదు, అది మనిషి పనితీరును, సంబంధాలను దెబ్బతీస్తోంది. దీనిపై సామాజికంగా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందిని హిమాలయ వెల్‌నెస్ ప్రతినిధి వికాస్ బన్సీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
