Atypical Depression : ఎటిపికల్ డిప్రెషన్ అంటే ఏమిటి..? 

సాక్షి లైఫ్ : మానసిక సమస్యల్లో అనేక రకాలున్నాయి. అటువంటి వాటిని ఆయా లక్షణాలను బట్టి ఒక్కో వర్గంగా భావిస్తారు. ప్రతి చిన్న విషయానికీ అతిగా స్పందించడం,ఎక్కువసేపు నిద్రించడం, బరువు పెరగడం.. ఇవన్నీ మానసిక రుగ్మతకు సంబంధించిన అలవాట్లు.. ఇవి ఒక రకమైన క్లిష్టమైన మానసిక స్థితికి సంకేతాలని శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణ డిప్రెషన్‌కు భిన్నంగా ఉండే ఈ 'ఎటిపికల్ డిప్రెషన్' (Atypical Depression) ఒక ప్రత్యేక జీవసంబంధిత విభాగమని, దీనిపై సాధారణ మందులు అంతగా పనిచేయవని తాజా పరిశోధనలో వెల్లడైంది.

 

ఇది కూడా చదవండి..New Guidelines : శరీరానికి అవసరమయ్యే నీటి పరిమాణంలో కొత్త మార్గదర్శకాలు..

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

 

సాధారణంగా డిప్రెషన్ అంటే ఆకలి తగ్గడం, నిద్ర పట్టకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ ఎటిపికల్ డిప్రెషన్‌లో ఇందుకు విరుద్ధంగా ఆకలి విపరీతంగా పెరగడం, ఎక్కువ సమయం నిద్రపోవడం వంటి 'రివర్స్' లక్షణాలు కనిపిస్తాయి. 'బయోలాజికల్ సైకియాట్రీ' అనే జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన ప్రకారం, ఈ తరహా కుంగుబాటు ఉన్నవారిలో జన్యుపరమైన మార్పులు కూడా భిన్నంగా ఉన్నాయి.

పరిశోధనలోని ప్రధాన అంశాలు..

సాధారణంగా వాడే యాంటీ-డిప్రెసెంట్ మందులు (SSRIs వంటివి) ఈ బాధితుల్లో సుమారు 12శాతం నుంచి15 శాతం తక్కువ ప్రభావం చూపుతున్నట్లు తేలింది. వీరిలో బాడీ మాస్ ఇండెక్స్ (BMI), టైప్-2 డయాబెటిస్, శరీరంలో వచ్చే వాపులకు (Inflammation) కారణమయ్యే జన్యువులు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

నైట్ ఔల్స్.. 

నిద్రలో కూడా తేడాలు ఉంటాయి. ఇలాంటి బాధితులు రాత్రిపూట మేల్కొని ఉండటానికి ఇష్టపడే 'నైట్ ఔల్స్'గా మారుతుంటారు. వీరి జీవ గడియారం (Circadian Rhythm) సాధారణం కంటే భిన్నంగా పనిచేస్తుంది.

మరి మీకూ ఈ లక్షణాలు ఉన్నాయా..?

మంచి వార్త విన్నప్పుడు వెంటనే మూడ్ మారి కాసేపు సంతోషంగా అనిపించడం (Mood Reactivity). కాళ్ళు, చేతులు సీసంలా బరువుగా అనిపించడం (Leaden Paralysis). ఇతరుల విమర్శలను లేదా తిరస్కరణను తట్టుకోలేకపోవడం. రోజుకు10 గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోవడం.

డిప్రెషన్ బాధితులందరికీ ఒకే రకమైన మందులు వాడటం కంటే, వారి శరీర తత్వాన్ని బట్టి 'ప్రిసిషన్ సైకియాట్రీ' (Precision Psychiatry) విధానంలో చికిత్స అందించడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఈ ఎటిపికల్ లక్షణాలు ఉన్నవారు వ్యాయామం, జీవనశైలి మార్పులతో పాటు నిపుణుల సలహాతో సరైన చికిత్స తీసుకోవాలి.

 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : mental-health depression depression-treatment depression-diet major-depression how-to-overcome-depression atypical-diabetes atypical-depression-meaning-in-telugu atypical-depression-symptoms atypical-depression-causes atypical-depression-treatment
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com