Digital Age : డిజిటల్ యుగంలో సౌకర్యాలున్నా.. యువతలో పెరుగుతున్న స్ట్రెస్ కారణాలేంటి..?

సాక్షి లైఫ్ : మునుపటి తరాలతో పోలిస్తే నేటి యువత జెన్ జెడ్ (Gen Z) అత్యంత సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతోంది. చేతిలో స్మార్ట్‌ఫోన్, వేగవంతమైన ఇంటర్నెట్, క్షణాల్లో ఇంటికి వచ్చే ఆహారం.. ఇలా అన్నీ ఉన్నా, వారిని 'ఆందోళన' (Anxiety) నీడలా వెంటాడుతోంది. గత ఏ తరంలోనూ లేనంతగా నేటి యువత మానసిక కుంగుబాటుకు లోనవుతుండటం చర్చనీయాంశంగా మారింది. డిజిటల్ ఒత్తిళ్లు, పర్యావరణ ఆందోళనలు ఈ సమస్యకు ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..

 

 ప్రశాంతత తగ్గిందా..?

పూర్వం సమాచారం కోసం వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సమాచారం వెల్లువలా ముంచెత్తుతోంది. ఆధునిక భారతదేశంలోని యువతకు అవకాశాలు పెరిగినప్పటికీ, వాటితో పాటే పోటీతత్వం, భవిష్యత్తుపై అనిశ్చితి కూడా పెరిగాయి.

ఆందోళనకు ప్రధాన కారణాలు..?

డిజిటల్ ఒత్తిడి (Digital Stress).. సోషల్ మీడియాలో ఇతరుల కృత్రిమ జీవనశైలిని చూసి తమ జీవితంతో పోల్చుకోవడం (Comparison Trait). ఇది అభద్రతా భావాన్ని పెంచుతోంది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల ద్వారా 24 గంటలు అందుబాటులో ఉండాలనే ఒత్తిడి 'సోషల్ బర్న్ అవుట్'కు దారితీస్తోంది.

పర్యావరణ ఆందోళన (Eco-Anxiety)..పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తు ఏమవుతుందో అన్న భయం వీరిలో బలంగా ఉంది. స్క్రీన్ సమయం పెరగడం వల్ల మెదడుకు విశ్రాంతి దొరక్కపోవడం. నిద్రలేమి సమస్యలు తెలెత్తడం..

పరిష్కార మార్గాలు ఏమిటి..? 

సోషల్ మీడియా వినియోగంపై స్వీయ నియంత్రణ పాటించడం. ప్రకృతితో మమేకం అవ్వాలి. రోజూ కాసేపు ఆరుబయట గడపడం, శారీరక వ్యాయామం చేయడం. సమస్య చిన్నదైనా పెద్దదైనా ఇంట్లోని పెద్దలతో లేదా నిపుణులతో పంచుకోవడం. యోగా, ధ్యానం వంటి పద్ధతుల ద్వారా ఏకాగ్రతను పెంచుకోవడం ద్వారా మనసును నియంత్రించవచ్చు. 

 భౌతిక సౌకర్యాలు మానసిక ప్రశాంతతకు గ్యారెంటీ ఇవ్వవు. యువతలో పెరుగుతున్న ఈ ఆందోళనను జబ్బుగా భావించకుండా, వారికి తగిన మానసిక ఆరోగ్య తోడ్పాటు (Mental Health Support) అందించడం ద్వారా మానసికంగా ప్రశాంతంగా ఉండొచ్చు. 

 

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : anxiety-effect anxiety digital depression-and-anxiety digital-detox-challenge how-to-do-a-digital-detox mental-clarity-from-digital-detox reduce-anxiety anxiety-in-menopause anxiety-relief
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com