Heart : ఫ్యాట్ మిల్క్ పై స్టడీస్ కలవరపెట్టే నిజాలు..! గుండె జబ్బులకు పాలు కారణమా..?

సాక్షి లైఫ్ : మనం నిత్యం తాగే పాల విషయంలో ఒక కీలకమైన ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పాలు, ముఖ్యంగా ఎక్కువ కొవ్వు (Whole-Fat Dairy) ఉన్న పాల ఉత్పత్తులు గుండె జబ్బుల (Coronary Heart Disease) ప్రమాదాన్ని పెంచుతున్నాయా? ఈ అంశంపై ఇటీవల వెలువడిన కొన్ని అధ్యయనాలు.. దశాబ్దాలుగా పాటిస్తున్న ఆహార నియమాలను ప్రశ్నిస్తున్నాయి.

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..? 

 

కొంతకాలంగా జరుగుతున్న పరిశోధనల్లో ఫ్యాట్ మిల్క్ వినియోగంపై భిన్నమైన ఫలితాలు వెలువడుతున్నాయి. కొవ్వు శాతం ఎక్కువగా ఉండే పాలలో శాచురేటెడ్ ఫ్యాట్ (Saturated Fat) ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL Cholesterol) స్థాయిని పెంచుతుందని, తద్వారా గుండె ధమనులలో పూడిక (Coronary Artery Disease) ఏర్పడి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరో అధ్యయనం మాత్రం..
  
ఎక్కువ మొత్తంలో (రోజుకు 1.5 గ్లాసుల కంటే ఎక్కువ) పాలు తాగే మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నాయి ఇటీవల కొన్ని నివేదికలు. మరో అధ్యయనం (CARDIA Study) మాత్రం... యువకులుగా ఉన్నప్పుడు పాలు ఎక్కువగా తీసుకున్న వారిలో 25 సంవత్సరాల తర్వాత గుండె ధమనుల్లో కాల్షియం పేరుకుపోయే (CAC - Coronary Artery Calcification) ప్రమాదం తక్కువగా ఉన్నట్లు తేల్చింది. అంటే, గుండె ఆరోగ్యానికి పాలు రక్షణగా నిలిచాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 

 కొవ్వు మాత్రమే కాదు, పాలలో ఉండే ఇతర పోషకాలు ప్రొటీన్, కాల్షియం, విటమిన్స్ వాటి సంక్లిష్ట నిర్మాణమే (Food Matrix) గుండెపై దాని ప్రభావాన్ని నిర్ణయించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అందుకే, కొవ్వు తక్కువగా ఉండే పాలు (Low-Fat Dairy) మాత్రమే మంచిదనే ఒకప్పటి సూచనలు ఇప్పుడు సవాలుగా మారుతున్నాయి.

మొత్తం మీద పాల ఉత్పత్తులు గుండె జబ్బులకు కారణమవుతాయా లేదా అనే విషయంలో స్పష్టమైన, ఏకరీతి నిర్ధారణకు ఇంకా రాలేదు. గుండె జబ్బులు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు..డాక్టర్ సలహా మేరకు కొవ్వు తక్కువగా (Low-Fat) లేదా కొవ్వు లేని (Skimmed) పాల ఉత్పత్తులను ఎంచుకోవడం ఉత్తమం.

ఎక్కువ కొవ్వు కలిగిన పాలు (Whole-Fat Milk) తీసుకోవడం వల్ల ప్రమాదం లేదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నప్పటికీ, నిపుణుల అభిప్రాయం మేరకు సమతుల్య ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం కీలకం. పులియబెట్టిన పాల ఉత్పత్తులు (Fermented Dairy) - ముఖ్యంగా పెరుగు (Yogurt) - గుండెకు మేలు చేస్తాయని నిరూపితమైంది.

 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

 ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : heart-risk bad-cholesterol heart-blocks heart-problems heart-diseases milk heart-failure cow-milk risk-of-heart-disease cholesterol high-cholesterol ldl-cholesterol raw-milk-benefits is-raw-milk-safe? raw-milk-vs.-pasteurized-milk raw-milk-nutrition healthy-fats-in-raw-milk raw-milk-side-effects coronary-heart-disease
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com