Vitamin supplements : ఎలాంటి విటమిన్ సప్లిమెంట్స్ ప్రాణాంతకం కావచ్చు..?

సాక్షి లైఫ్ : విటమిన్ సప్లిమెంట్లు (vitamin supplements) ఆరోగ్యానికి రక్షణగా చాలా మంది వాడుతూ ఉంటారు. అయితే, అవసరం లేకపోయినా, వైద్యుల సలహా లేకుండా వీటిని అధిక మోతాదులో తీసుకోవడం ప్రాణాంతకమైన ప్రమాదాలకు దారితీయవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక మోతాదులో విటమిన్ మాత్రలు తీసుకున్న ఒక మహిళ ఏకంగా గుండెపోటు కారణంగా (Irregular Heartbeat) ఆసుపత్రిలో చేరిన ఉదంతం కూడా జరిగింది.  

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

అవసరం లేకుండా విటమిన్ సప్లిమెంట్స్ ఎందుకు వాడకూడదు..?

విటమిన్లు శరీరానికి చాలా అవసరం. కానీ లోపం ఉన్నప్పుడు మాత్రమే వైద్యులు వీటిని సిఫార్సు చేయాలి. సొంత వైద్యం చేసుకుని ఎక్కువ మోతాదులో తీసుకుంటే కలిగే అనర్థాలు చాలానే ఉన్నాయి. 


 విటమిన్అధిక మోతాదు వల్ల కలిగే ప్రమాదాలు విటమిన్-డి (Vitamin D)కిడ్నీలో రాళ్లు (Kidney Stones), రక్తంలో కాల్షియం స్థాయిలు పెరగడం, అలసట. 
విటమిన్-ఇ (Vitamin E)రక్తం గడ్డకట్టడం ఆలస్యం కావడం, రక్తస్రావం (Bleeding) ప్రమాదం.

విటమిన్-ఎ (Vitamin A)కాలేయం దెబ్బతినడం, ఎముకలు బలహీనపడటం.

విటమిన్-సి (Vitamin C)అతిసారం (Diarrhea), జీర్ణ సమస్యలు, కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం.

ఐరన్ (Iron)మలబద్ధకం, కడుపు తిమ్మిరి, జీర్ణవ్యవస్థలో సమస్యలు. విటమిన్ బి6 (Pyridoxine)నరాల దెబ్బతినడం (Neuropathy), కాళ్ళలో తిమ్మిరి లేదా జలదరింపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి అవసరం లేకుండా విటమిన్ సప్లిమెంట్స్ వాడకూడదని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?

ఇది కూడా చదవండి.. జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి..  చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : vitamin-d-tablets vitamin-d vitamins vitamin-k k-vitamin vitamin-k-food vitamin-b12 vitamin-b12-deficiency vitamin-c c-vitamin immune-system-support collagen-supplement omega-3-supplements supplementation
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com