Insurance Information : హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఓపీడీ సేవలు కూడా పొందవచ్చా..? 

సాక్షి లైఫ్ : వేగంగా మారుతున్న వైద్య రంగంలో, పెరుగుతున్న వైద్య ఖర్చుల మధ్య ఆరోగ్య బీమా (Health Insurance) ప్రాముఖ్యత మరింత పెరిగింది. అయితే, చాలా మంది బీమా పాలసీలు కేవలం ఆసుపత్రిలో చేరినప్పుడు (In-Patient) అయ్యే ఖర్చులను మాత్రమే కవర్ చేస్తాయని భావిస్తారు. కానీ, ఆసుపత్రిలో చేరకుండా బయట జరిగే చికిత్స ఖర్చులను కూడా కవర్ చేసేదే 'ఓపీడీ కవర్' (Out-Patient Department Cover). నేటి రోజుల్లో ఇది అత్యంత ముఖ్యమైన కవరేజీగా మారుతోంది.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..? 

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?

 

అసలు ఓపీడీ కవర్ అంటే ఏమిటి..?

ఓపీడీ అంటే ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్. ఓపీడీ కవర్ అనేది ఆసుపత్రిలో చేరకుండా, కేవలం బయటి విభాగంలో డాక్టర్‌ను సంప్రదించడానికి, వైద్యపరీక్షలు చేయించుకోవడానికి, మందులు కొనుగోలు చేయడానికి అయ్యే వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది.సాధారణంగా జరిగే ఈ ఖర్చులన్నీ ఓపీడీ కవర్ కిందకు వస్తాయి.  వీటిలో డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు, డయాగ్నోస్టిక్ టెస్ట్‌లు రక్త పరీక్షలు, ఎక్స్-రే, స్కాన్లు, ఎంఆర్‌ఐ మొదలైనవి ఉంటాయి. డాక్టర్ రాసిన  ప్రిస్క్రిప్షన్‌పై కొనుగోలు చేసిన మందులు, ఫిజియోథెరపీ లేదా ఆసుపత్రిలో చేరకుండా చేసే చిన్నపాటి చికిత్సలు ఓపిడి సేవల కింద పొందవచ్చు.

ఓపీడీ కవర్ ఎందుకు తప్పనిసరి..?

మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా, ఓపీడీ కవర్ ఎంతో అవసరం. సాధారణ డాక్టర్ ఫీజు, డయాగ్నోస్టిక్ టెస్ట్‌ల ఖర్చు ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంది. తరచుగా డాక్టర్‌ను కలిసే వారికి ఈ ఖర్చులను జేబు నుంచి భరించడం కష్టం. కాబట్టి ఓపీడీ కవర్ ఈ భారాన్ని తగ్గిస్తుంది.

దీర్ఘకాలిక వ్యాధులు (Chronic Diseases): డయాబెటిస్, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి తరచుగా వైద్యుడిని సంప్రదించడం, టెస్ట్‌లు, మందులు అవసరం. ఈ ఖర్చులన్నీ ఓపీడీ కవర్ ద్వారా సులభంగా పొందవచ్చు.


ఓపీడీ కవర్ ఉంటే, ఖర్చు గురించి ఆలోచించకుండా, చిన్న చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించే అవకాశం ఉంటుంది. ఇది వ్యాధులను సమయానికి గుర్తించి, అవి తీవ్రం కాకుండా నివారించడానికి సహాయపడుతుంది. అంతేకాదు చిన్న పిల్లలు లేదా వృద్ధులు ఉన్న కుటుంబాలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. వారికి తరచుగా డాక్టర్ కన్సల్టేషన్ అవసరం అవుతుంది.

 ఓపీడీ కవర్ ఎలా పనిచేస్తుంది..?

రియింబర్స్‌మెంట్ (Reimbursement).. సాధారణంగా, మీరు డాక్టర్ ఫీజు, టెస్ట్ బిల్లులు, మందుల బిల్లులు చెల్లించి, వాటిని బీమా కంపెనీకి సమర్పించిన తర్వాత డబ్బును తిరిగి పొందవచ్చు.

క్యాష్‌లెస్ సర్వీసెస్..  

 కొన్ని బీమా కంపెనీలు తమ నెట్‌వర్క్‌లోని క్లినిక్‌లు లేదా డయాగ్నోస్టిక్ సెంటర్లలో క్యాష్‌లెస్ ఓపీడీ సేవలను కూడా అందిస్తాయి.

  హెల్త్ పాలసీ ఎంచుకునే ముందు గమనించాల్సిన అంశాలు ఏమిటంటే..? 

కవర్ పరిమితి (Sub-Limit).. పాలసీలో ఓపీడీ కోసం కేటాయించిన గరిష్ట మొత్తం ఎంత ఉందో చూడాలి.

వెయిటింగ్ పీరియడ్.. ఓపీడీ ప్రయోజనాలు ప్రారంభం కావడానికి ఎంత సమయం వేచి ఉండాలో తెలుసుకోవాలి.

ప్రీమియం.. సాధారణ పాలసీ కంటే ఓపీడీ కవర్‌తో కూడిన ప్రీమియం కొద్దిగా పెరుగుతుంది. ఆ పెరుగుదల ఎంత ఉందో చూసుకోవాలి.

నెట్‌వర్క్ క్లినిక్‌లు.. మీ ప్రాంతంలో క్యాష్‌లెస్ సర్వీసెస్ అందించే నెట్‌వర్క్ ఆసుపత్రులు, క్లినిక్‌లు అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకోండి. ప్రస్తుతం హాస్పిటల్‌లో చేరే ఖర్చులతో పాటు బయట అయ్యే ఖర్చులను కూడా కవర్ చేసే ఓపీడీ కవర్‌ను ఎంచుకోవడం ఉత్తమం. 

 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..థ్రోంబోసైట్లు అంటే ఏమిటి..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : health-insurance-new-rules health-insurance health-insurance-policy health-insurance-policyholders opd insurance-for-senior-citizens insurance-claim-rejection health-insurance-tips buying-health-insurance-guide what-to-check-before-buying-insurance choosing-a-health-insurance-plan how-to-select-health-insurance insurance-premium-gst gst-free-insurance insurance-policy-prices new-insurance-rules-india opd-system
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com