వింటర్ సీజన్ అలర్ట్ : ఉసిరిలో అనేక ఔషధ గుణాలు.. 

షేర్ చేయండి:
వింటర్ సీజన్ అలర్ట్ : ఉసిరిలో అనేక ఔషధ గుణాలు.. 

సాక్షిలైఫ్ : ఉసిరికాయ (Amla) అనేది అనేక ఔషధ గుణాలను కలిగి ఉన్న ఆరోగ్యానికి ఎంతో ఉత్తమమైనది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు : ఉసిరికాయలో ఉన్న విటమిన్ "సి"తోపాటు యాంటీ ఆక్సిడెంట్స్  ఉంటాయి. ఇవి శరీరాన్ని హానికరమైన ఫ్రీ ర్యాడికల్స్ నుంచి కాపాడతాయి. అంతేకాదు హానికరమైన క్రిములు, బ్యాక్టీరియాలకు నిరోధకంగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న విటమిన్ సి, ఫైబర్, ఖనిజాలు ఇతర పోషకాలు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

ఇమ్యూనిటీ బూస్టర్ : ఉసిరికాయలో ఉన్న విటమిన్ సి తోపాటు ఇతర పోషకాలు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. తద్వారా అనేక సీజనల్ వ్యాధులు బారీన పడకుండా ఉండవచ్చు.

 

కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి..? వాటికి కారణమేమిటి..?

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

 

గుండె ఆరోగ్యం: ఉసిరికాయ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, రక్తప్రసరణను  మెరుగుపరుస్తుంది.

జుట్టు ఆరోగ్యం: ఉసిరికాయ జుట్టుకు ఎంతోబాగా ఉపయోగపడుతుంది. ఇది జుట్టు రాలడం తగ్గించి జుట్టు పెరగడానికి తోడ్పడమేకాకుండా దానిని సంరక్షిస్తుంది.   

జీర్ణక్రియ: ఉసిరికాయ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.

యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు : ఉసిరికాయలో ఉన్న కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి గాయాలు, వాపుల నుంచి ఉపశమనం అందిస్తాయి. ఉసిరికాయ నాడీ వ్యవస్థకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని పెంచి,నాడీ సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

చర్మం : ఉసిరికాయ చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇది వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది.

 

ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోప‌తి అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?.. 

ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు

ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.