మూత్రాన్ని ఎక్కువసేపు ఆపడం వల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తాయా..? 

షేర్ చేయండి:
మూత్రాన్ని ఎక్కువసేపు ఆపడం వల్ల కిడ్నీలో స్టోన్స్ వస్తాయా..? 

సాక్షి లైఫ్ : మన శరీరం అనేక విధాలుగా విషాన్ని తొలగిస్తుంది. అటువంటి విధానాల్లో మూత్ర విసర్జన కూడా ఒకటి. ఇది శరీరంలోని మురికి బయటకు వచ్చే సహజ ప్రక్రియ. అయితే, కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల మూత్రాన్ని ఆపుకోవలసి వస్తుంది. అయితే మూత్రాన్ని ఆపుకోవడానికి ఎన్నిరకాల కారణాలున్నా.. అది మాత్రం తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. మూత్రాన్ని ఆపుకోవడం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..  

 

ఇది కూడా చదవండి..మీకు ఉప్పు ఎక్కువగా తినే అలవాటు ఉందా..? ఇది మీకోసమే..

ఇది కూడా చదవండి..ఇలాంటి రాష్ట్రాల్లోనే మధుమేహం కేసులు ఎక్కువ.. 

ఇది కూడా చదవండి..మంచినీళ్లు ఎక్కువగా తాగితే ఏమౌతుంది..?

ఇది కూడా చదవండి..మధుమేహం నియంత్రణలో ఉండాలంటే..? ఏమేం చేయాలి..? 

 

 

 

 అయితే కొన్ని కారణాల వల్ల కొన్నిసార్లు మూత్రాన్ని ఆపుకోవల్సి వస్తుంది. లాంగ్ మీటింగ్, లాంగ్ డ్రైవ్ లేదా అనేక ఇతర కారణాల వల్ల చాలా సార్లు మూత్రం ఆపుకోవాల్సి వస్తుంది, కానీ ఈ చిన్న అలవాటు అనేక అనారోగ్య  సమస్యలకు కారణం అవుతుంది. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్, కిడ్నీఇన్ఫెక్షన్లు రావడమేకాకుండా మూత్ర వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. 
 
మూత్రపిండాల్లో రాళ్లు..  

సాధారణంగా ఒక వ్యక్తి రోజుకు 6 నుంచి 8 సార్లు మూత్ర విసర్జన చేస్తాడు. ఇది శరీరం నుంచి కాల్షియం, ఆక్సలేట్ వంటి ఖనిజాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ ఖనిజాలు కిడ్నీలో రాళ్లను కలిగిస్తాయి. అటువంటి పరిస్థితిలో, మీరు ఎక్కువసేపు మూత్రవిసర్జనను ఆపివేయడం వల్ల ఈ ఖనిజాలు క్రమంగా మూత్రపిండాల్లో రాళ్లుగా మారుతాయి.

ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.