సాక్షి లైఫ్ : బరువు తగ్గాలనుకునేవాళ్ళు అస్సలు తినకూడని కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. అలాగే సన్నబడటానికి ఆకలితో ఉండకూడదు. ఇది శరీరంలోని శక్తిని ప్రభావితం చేస్తుంది. బలహీనతకు దారితీస్తుంది. చాలా ఆహార పదార్థాలు ప్రయోజనకరమని అయితే మీరు స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి డైట్ ప్లాన్‌ని అనుసరిస్తు న్నట్లయితే ఖచ్చితంగా కొన్ని ఆహారపదార్థాలను తీసుకోవద్దంటున్నారు వైద్య నిపుణులు..
ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న వ్యక్తులు పోషకాహారం గురించి సరైన సమాచారాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఊబకాయం లేదా బరువు పెరగడం అనేది పలు వ్యాధులకు ప్రధాన కారణమవుతుందని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. స్థూలకాయాన్ని తగ్గించడం చాలా ముఖ్యం. బరువు తగ్గడానికి శారీరక శ్రమ అవసరం. సమతుల్య ఆహారం కూడా చాలా ముఖ్యం. అయితే త్వరగా బరువు తగ్గాలనుకుంటే డైట్ ప్లాన్‌లో సరైన ఆహారాలను తప్పనిసరిగా చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఉగాండాలో విజృంభిస్తున్న కొత్తవ్యాధి డింగా డింగా..
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
బరువు తగ్గాలంటే ఏయే అంశాలను దృష్టిలో ఉంచుకోవాలో తెలుసుకుందాం.
ఇవి అస్సలు వద్దు..
పెరిగిన బరువును తగ్గించుకోవడానికి కీటో డైట్, అట్కిన్స్ డైట్ పాటించకూడదని అధ్యయనాలు చెబుతున్నాయి. బరువు తగ్గడానికి, కొందరు కీటో డైట్, అట్కిన్స్ డైట్ ప్లాన్‌ని అవలంబిస్తారు. అయితే ముందుగా మీరు అట్కిన్స్ డైట్, కీటో డైట్ అంటే ఏమిటో తెలుసుకోవాలి..? ఆయా డైట్ ను ఫాలో అవ్వడంవల్ల లాభాలు-నష్టాలూ కూడా తెలుసుకోవాలి.
కీటోజెనిక్ డైట్‌ని కీటో డైట్ అంటారు. దీనిని తక్కువ కార్బ్ డైట్, తక్కువ కార్బ్ హై ఫ్యాట్ డైట్ అని కూడా అంటారు. కీటో డైట్‌లో తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కొంచెం కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు, అత్యధిక మొత్తంలో ప్రోటీన్లు ఉంటాయి.
అట్కిన్స్ డైట్ ..
అట్కిన్స్ ఆహారంలో బరువు తగ్గడానికి, కార్బోహైడ్రేట్ల పరిమాణం పరిమితంగా ఉంటుంది. మరోవైపు మీకు కావలసినంత ఎక్కువ ప్రోటీన్ ,కొవ్వు లభించదు. ఈ డైట్ విషయంలో శరీరానికి కావాల్సిన శక్తిని ఇచ్చే పోషకాలు అందవు. కాబట్టి దీనివల్ల ఆరోగ్యానికి అంత సేఫ్ కాదని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు.
కీటోడైట్..
శాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన పరిశోధకుడు డాక్టర్ ఈతాన్ వీస్, తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారంపై సందేహాన్ని వ్యక్తం చేశారు, అతను స్వయంగా కీటోజెనిక్ డైట్‌ను ఉపయోగించానని చెప్పాడు. చాలా మంది పరిశోధకులు అల్పాహారం తినకుండా సలాడ్, గింజలు, చీజ్, కాల్చిన కూరగాయలు, కాల్చిన చికెన్, చేపలు, డార్క్ చాక్లెట్‌లను తీసుకుంటారు. కీటో డైట్ తీసుకోవడం వల్ల అనవసరమైన ఖర్చులకు దారి తీస్తుంది. ఈ ఆహారం దీర్ఘకాలంలో హానికరం. అయినప్పటికీ, మీరు ఈ డైట్‌ని అవలంబిస్తున్నట్లయితే, మీరు కీటో వియాన్ ఆఫ్ డైట్‌ని అనుసరించవచ్చు.
జీఎం డైట్..
జీఎం డైట్ ప్లాన్ ప్రకారం ఏడు రోజుల్లో ఏడు కిలోల బరువు తగ్గుతుందని చెబుతారు. వారంలో ఏడు రోజులు వివిధ ఆహార పదార్థాలు తీసుకుంటారు. జీఎం డైట్ ప్లాన్‌లో ఎక్కువగా శరీరాన్ని డిటాక్సిఫికేషన్ (నిర్విషీకరణ) చేసే ఆహారాలు ఉంటాయి. ఈ డైట్ ప్లాన్‌ని అనుసరించడం ద్వారా బరువు వేగంగా తగ్గుతారట. అయితే ఇది తక్కువ వ్యవధిలో మాత్రమే జరుగుతుంది. ఆ తర్వాత ఈ డైట్ ప్లాన్ ఆపేయగానే మళ్లీ బరువు పెరగడం మొదలవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com