ఈ 10 ఆహారాలను మీ ఆహారంలో చేర్చుకుంటే.. శరీరంలో కాల్షియం లోపం ఉండదు..

సాక్షి లైఫ్ : మీకు తరచుగా పాదాలు నొప్పిగా అనిపిస్తుంటాయా..? అయితే, దీని వెనుక కారణం కాల్షియం లోపం కావచ్చు. శరీరంలో కాల్షియం లేకపోవడం వల్ల, ఎముకలు బలహీనంగా మవుతాయి. క్యాల్షియం లోపించడం కారణంగా ఎముకలు నొప్పిగా అనిపిస్తుంది. అందువల్ల, ఆహారంలో కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవడం చాలా ముఖ్యం. అలాంటి కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ అంటువ్యాధా..? కాదా..?

ఇది కూడా చదవండి..పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ కు కీమోథెరపీతో చికిత్స చేయవచ్చా..?

ఇది కూడా చదవండి..చికిత్సతో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందా..? 

ఇది కూడా చదవండి..అపోహలు-వాస్తవాలు : వృద్ధులలో మాత్రమే బ్లడ్ క్యాన్సర్ వస్తుందా..? 

 

 కాల్షియం-రిచ్ ఫుడ్స్: కాల్షియం శరీరంలో కనిపించే ముఖ్యమైన ఖనిజం. ఎముకలు, దంతాలను బలోపేతం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కండరాల సంకోచం, రక్తం గడ్డకట్టడం, నాడీ వ్యవస్థ పనితీరుకు కాల్షియం ఎంతో అవసరం. క్యాల్షియం లోపం ఎముకల బలహీనత, బోలు ఎముకల వ్యాధి,కండరాల తిమ్మిరి వంటి సమస్యలను కలిగిస్తుంది.

అందువల్ల, శరీరంలో సరైన సమతుల్యతను కాపాడుకోవడానికి, మన ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం డైరీ ప్రొడక్ట్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. శరీరంలో కాల్షియం లోపాన్ని అధిగమించడంలో సహాయపడే కొన్ని ఆహారాలు ఏమేమున్నాయంటే..?  

 

కాల్షియం రిచ్ ఫుడ్స్.. 

 

పాలు, పాల ఉత్పత్తులు: పాలు, పెరుగు, జున్ను మొదలైనవి కాల్షియం పొందడానికి మంచి వనరులు. వీటిని రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం లోపం ఉండదు.

ఆకు కూరలు : పాలకూర, బచ్చలికూర, కాలే, బ్రకోలీ వంటి ఆకుకూరలు కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. వీటిని మీ రోజువారీ ఆహారంలో భాగంగా  చేసుకోవడం వల్ల శరీరానికి తగిన కాల్షియం లభిస్తుంది. 

 
బాదం : బాదంలో కూడా అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది. కాల్షియంతోపాటు ఇందులో ఎక్కువ మొత్తంలో ఫైబర్, విటమిన్" ఇ" కూడా ఉన్నాయి. ఇది మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

నువ్వులు: నువ్వులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. మీరు వీటిని పలు వంటలలో చేర్చడం ద్వారా లేదా లడ్డూల రూపంలో కూడా తినవచ్చు.

చేపలు: చేపలలో శరీరానికి అవసరమైన కాల్షియం లభిస్తుంది. కాబట్టి చేపలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా క్యాల్షియం లోపం లేకుండా ఉండొచ్చు. 

సోయా ఉత్పత్తులు: సోయా ఉత్పత్తులు టోఫు, సోయా పాలు, సోయా పెరుగు మొదలైన వాటిలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి.

అంజీర: ఎండిన అంజీర పండ్లలో కాల్షియం లభిస్తుంది. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల ఫైబర్, విటమిన్లు మొదలైన ఇతర అవసరమైన పోషకాలతో పాటు కాల్షియం కూడా లభిస్తుంది.

చియా సీడ్స్ : చియా గింజల్లో కాల్షియం ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇది కాకుండా, అనేక ఇతర పోషకాలు కూడా ఇందులో ఉంటాయి.

ఫోర్టిఫైడ్ ఫుడ్స్: ఫోర్టిఫైడ్ ఫుడ్స్ అంటే పోషకాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు. పాలు, తృణధాన్యాలు మొదలైనవి కాల్షియంతో కూడిన ఆహారాలు.

బీన్స్, పప్పులు: బీన్స్ , పప్పులు, బఠానీలు, వైట్ బీన్స్, బ్లాక్ బీన్స్ కందిపప్పు మొదలైనవాటిలో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా, మీరు శరీరానికి కావాల్సిన కాల్షియాన్ని పొందవచ్చు.

ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..

ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?

ఇది కూడా చదవండి..న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్‌ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : women-health mental-health bone-health weak-bones calcium-myths strong-bones healthy-bones calcium-deficiency calcium calcium-rich-fruits calcium-fruits-list accumulated-calcium bone-and-joint-health bone-and-joint-supplement bone-health-in-children
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com