జుట్టు రాలడానికి కారణమయ్యే హార్మోన్..

షేర్ చేయండి:
జుట్టు రాలడానికి కారణమయ్యే హార్మోన్..

సాక్షి లైఫ్ : డైహైడ్రోటెస్టోస్టెరాన్ అనే హార్మోన్  జుట్టు రాలడానికి కారణమయ్యే ఒక రకమైన హార్మోన్. పురుష జీవ లక్షణాల అభివృద్ధికి ఇది చాలా ముఖ్యమైంది. కానీ ఒక్కోసారి అధిక స్థాయిలో ఉత్పత్తి అయినప్పుడు, డీహెచ్ టీ అణువులు వెంట్రుకల ఎదుగుదలను ఆపేస్తాయి. వెంట్రుక కణాల రక్త సరఫరాను అడ్డుకుంటాయి. అలాంటి వాటిని హోమియోపతి వైద్యం ద్వారా నియంత్రించవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. జుట్టు రాలడానికి ప్రధానంగా నాలుగు కారణాలున్నాయి. మొదటి కారణం హార్మోన్ల మార్పులు.. హెయిర్ ఫాల్ అనేది హార్మోన్ల మార్పుల వల్ల కూడా తలెత్తుతుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. రెండవది కొన్ని తీవ్రమైన వ్యాధులు లేదా వైద్య పరిస్థితుల కారణంగా కూడా జుట్టు రాలడం జరుగుతుంది.

మరికొందరిలో..

మూడవది వంశపారంపర్యంగా కూడా హెయిర్ ఫాల్ సంభవిస్తుందని డాక్టర్లు అంటున్నారు. నాల్గవ కారణం వయస్సు పెరగడంతో చాలామంది శారీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అందులో భాగంగా జుట్టు రాలుతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మరికొందరిలో పోషకాహార లోపం వల్ల హెయిర్ ఫాల్ సమస్య తలెత్తవచ్చని వారు చెబుతున్నారు.    

 

ఇది కూడా చదవండి..ఆకు కూరలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..?

ఇది కూడా చదవండి..బరువు సంతానోత్పత్తిని ఎలా ప్రభావితం చేస్తుంది..?

ఇది కూడా చదవండి..గర్భాశయ క్యాన్సర్ పరీక్షల కోసం మార్గదర్శకాలు..?

ఇది కూడా చదవండి..బరువు తగ్గడానికి ఎలాంటి సర్జరీ బెటర్..

 

ఇది కూడా చదవండి..సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలి..?

 

మానసిక ఒత్తిడి.. 

 జుట్టు రాలడం వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోవడం, ఆందోళన, మానసిక ఒత్తిడి వంటి సమస్యలకు దారి తీస్తుంది. రోజుకి 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం సర్వసాధారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ ఎవరికైనా హెయిర్ ఫాల్ సమస్య ఉన్నప్పుడు, రోజుకు సగటున 100 వెంట్రుకలకు పైగా రాలుతాయట. ఇంతపెద్ద మొత్తంలో వెట్రుకలు రాలితే హెయిర్ ఫాల్ గా భావిస్తామని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.

 వెంట్రుకలు సన్నగా కనిపించడం, కొత్త వెంట్రుకలు అస్సలు పెరగనప్పుడు ఈ సమస్య ఆందోళనకరంగా మారుతుంది. జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి, ముందుగా మీ ఆహారంపై శ్రద్ధ వహించాలని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఆరోగ్యకరమైన జుట్టు కోసం, మీ రోజువారీ ఆహారంలో కొన్ని పోషకాలను తప్పనిసరిగా చేర్చుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. 

64శాతంమంది.. 

పలు పరిశోధనల ప్రకారం 64శాతంమంది భారతీయులు జుట్టు రాలు సమస్యతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణాలు ఒత్తిడి, కాలుష్యం, నీటి నాణ్యత తక్కువగా ఉండటం. జుట్టు రాలు సమస్యను నియంత్రించడానికి, కొందరు పలురకాల నూనె లు ,షాంపూలు వంటివి వినియోగిస్తుంటారు. ఈ సమస్యను నియంత్రించడంలో సహాయపడటానికి, బట్టతల (అలోపేసియా), హైపోట్రికోసిస్, జుట్టు రాలడానికి సంబంధించిన ఇతర సమస్యలకు చికిత్స చేయడంలో హోమియోపతి వైద్య విధానంలో మంచి ఫలితాలు పొందవచ్చని హోమియోపతి వైద్యనిపుణులు చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి..పక్షవాతంలో ఎన్ని రకాలు ఉన్నాయి..? 

ఇది కూడా చదవండి..ఎక్కువసేపు స్క్రీన్ పై గడపడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..బరువు పెరగడానికి నిర్దిష్ట పండ్లు ఉన్నాయా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.