మెదడు తినే అమీబా వ్యాధి ప్రభావం ఎలా ఉంటుంది..?

షేర్ చేయండి:
మెదడు తినే అమీబా వ్యాధి ప్రభావం ఎలా ఉంటుంది..?

సాక్షి లైఫ్ : అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అంటువ్యాధి కాదు. కేరళలో మూడు నెలల్లో ముగ్గురు వ్యక్తులు ఈ వ్యాధితో మరణించారు. అయితే వారు వేర్వేరు జిల్లాలకు చెందినవారు. వ్యాధి సోకి మరణించిన వారందరూ వ్యాధి సోకకముందు వాళ్లంతా కొలనుల్లో స్నానం చేశారు. ఇదే వ్యాధికి కారణమని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..కంటి సమస్యలకు ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స చేస్తారు..?

ఇది కూడా చదవండి.. వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?

 ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు.. 

అమీబిక్ ఎన్సెఫాలిటిస్..  

 మెదడును తినే అమీబా (బ్రెయిన్ ఈటింగ్ అమీబా) మరోసారి కేరళను వణికిస్తోంది. మూడు నెలల్లోనే ఈ వ్యాధికారక అమీబిక్ ఎన్సెఫాలిటిస్ బారిన పడి కేరళలో ముగ్గురు మరణించారు. ఈ వ్యాధి ఎలా వస్తుంది..? ఎలాంటివాళ్లకు ఎక్కువగా సోకుతుంది..? ఈ వ్యాధి అంటువ్యాధి కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 


బాడీలో.. 

చెరువులు మొదలైన వాటిలో కనిపించే అమీబా వల్ల ఈ అరుదైన వ్యాధి వస్తుంది. దీనినే "బ్రెయిన్ ఈటింగ్ అమీబా" అంటారు. ఈ అమీబా సాధారణంగా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు అది నేరుగా మెదడుకు వెళుతుంది. అమీబా మెదడులోని నాడీ కణాలను తింటుంది. తద్వారా ఇన్ఫెక్షన్ తలెత్తుతుంది. ఈ వ్యాధి మనిషి నుంచి మనిషికి వ్యాపించదని వైద్యనిపుణులు చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. 

ఇది కూడా చదవండి..మలప్పురంలోని పాండిక్కాడ్ నుంచి సేకరించిన గబ్బిలాల నమూనాల్లో నిఫా వైరస్ యాంటీబాడీస్..

ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.