Diabetes : మధుమేహ సమస్య ఉన్నవాళ్లు పుచ్చకాయ తినొచ్చా..?  

షేర్ చేయండి:
Diabetes : మధుమేహ సమస్య ఉన్నవాళ్లు పుచ్చకాయ తినొచ్చా..?  

సాక్షి లైఫ్ : భానుడి భగభగలకు విరుగుడుగా వేసవిలో మార్కెట్లో ఎక్కడ చూసినా పుచ్చకాయలే దర్శనమిస్తుంటాయి. శరీరానికి చలవనిచ్చే ఈ పండును మధుమేహ రోగులు తినవచ్చా..? లేదా..? అన్న సందేహం చాలామందిలో ఉంటుంది. పుచ్చకాయ తీపిగా ఉండటం వల్ల చక్కెర స్థాయిలు పెరిగిపోతాయేమోనని భయపడేవారు కొందరైతే.. ఇందులో నీటి శాతం ఎక్కువ కాబట్టి ఏమీ కాదని తినేవారు మరికొందరు. దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారో ఈ ప్రత్యేక కథనం ద్వారా తెలుసుకుందాం..

 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

 

గ్లైసెమిక్ ఇండెక్స్ ప్రభావం..

సాధారణంగా ఏదైనా ఆహారం రక్తంలోని చక్కెరపై చూపే ప్రభావాన్ని 'గ్లైసెమిక్ ఇండెక్స్' (GI) ఆధారంగా నిర్ణయిస్తారు. పుచ్చకాయ జీఐ విలువ 72 నుంచి 80 వరకు ఉంటుంది. ఇది అధిక విలువ కిందకే వస్తుంది. అంటే ఈ పండు తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే, ఇందులో కేలరీలు తక్కువగా ఉండటం, సుమారు 90 శాతం పైగా నీరే ఉండటం వల్ల మధుమేహులు దీనిని పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

పరిమాణం ఎంత ఉండాలి..?

మధుమేహ రోగులు పుచ్చకాయ తినాలనుకుంటే మోతాదు అత్యంత ముఖ్యం. రోజుకు ఒకట్రెండు కప్పుల పుచ్చకాయ ముక్కలకు మించకుండా తీసుకోవడం సురక్షితం. ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా పరిమితంగా తీసుకోవాలి. ఖాళీ కడుపుతో కాకుండా భోజనానికి, భోజనానికి మధ్యలో స్నాక్ లాగా తీసుకోవడం మంచిది.

ముక్కలే ముద్దు.. జ్యూస్ వద్దు.. 

పుచ్చకాయను జ్యూస్ రూపంలో తీసుకోవడం కంటే ముక్కలుగా తినడమే శ్రేయస్కరం. పండును ముక్కలుగా తిన్నప్పుడు అందులోని పీచు పదార్థం శరీరానికి అందుతుంది. ఇది రక్తంలో చక్కెర శోషణ వేగాన్ని తగ్గిస్తుంది. అదే రసం రూపంలో తీసుకుంటే ఫైబర్ కోల్పోవడంతో పాటు నేరుగా చక్కెర శరీరంలోకి చేరి గ్లూకోజ్ స్థాయిలను ఒక్కసారిగా పెంచేస్తుంది.

ప్రోటీన్లతో కలిపి తీసుకుంటే..?

మధుమేహ రోగులు పుచ్చకాయ తిన్నప్పుడు చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా ఉండాలంటే.. దీనిని బాదం, వాల్‌నట్స్ వంటి నట్స్ లేదా పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ త్వరగా కలవకుండా నిరోధించవచ్చు. మధుమేహం నియంత్రణలో లేని వారు మాత్రం వైద్యుని సలహా మేరకే పండ్లను తీసుకోవడం ఉత్తమం.

 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.