బాడీని పర్ఫెక్ట్ గా డిటాక్స్ చేసే 5 డ్రింక్స్..   

సాక్షి లైఫ్ : పండుగ సందర్భంగా రుచికరమైన వంటకాలను చిన్న, పెద్ద అనే తేడాల్లేకుండా ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు. పండుగసీజన్ లో పలు రకాల తినుబండారాలు తిన్న తర్వాత శరీరాన్ని డిటాక్స్ చేయడం చాలా ముఖ్యం అని మీకు తెలుసా..? అవును.. ఇలాంటి ఆహారం జీర్ణక్రియను గందరగోళానికి గురిచేయడమే కాకుండా బరువును కూడా పెంచుతుంది. పండుగ సమయంలో ఇంట్లో వివిధ రకాల స్వీట్లను తయారు చేయడమే కాకుండా బయటి వస్తువులను కూడా ఎక్కువగా తింటారు. అధిక నూనె, మసాలాలు, స్వీట్లు తీసుకోవడం వల్ల బరువు పెరగడమే కాకుండా   జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. మీరు కూడా ఈ పండుగ సీజన్‌లో ఎక్కువగా తిని, తాగితే ఖచ్చితంగా మీ శరీరాన్ని డిటాక్స్ చేయాల్సిందే. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడంలో ఉపయోగపడే 5 డిటాక్స్ డ్రింక్స్‌ గురించి తెలుసుకుందాం.. 

 

ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు.. 

ఇది కూడా చదవండి..పక్షవాతంలో ఎన్ని రకాలు ఉన్నాయి..? 

ఇది కూడా చదవండి..ఎక్కువసేపు స్క్రీన్ పై గడపడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి..?

జీలకర్ర..  

జీలకర్ర నీటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్, ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి, ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో మంచి పనితీరు కనబరుస్తుంది. జీలకర్ర నీటిని రెగ్యులర్ గా తీసుకుంటే జీవక్రియను పెంచడమే కాకుండా, ఆకలిని నియంత్రించే హార్మోన్లు కూడా సమతుల్యంగా ఉంటాయి. ఈ రెండు అంశాలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. కాబట్టి రాత్రి పడుకునే ముందు ఒక చెంచా జీలకర్రను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి, ఉదయం ఈ నీటిని వడపోసి పరగడుపుతో తాగాలి.

నిమ్మకాయ-అల్లం.. 


నిమ్మకాయ రసం, అల్లంతో చేసిన పానీయం శరీరాన్ని డిటాక్స్ చేయడమే కాకుండా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ తాగడం వల్ల శరీరానికి పూర్తి శక్తి అందుతుంది. తద్వారా జీవక్రియ కూడా మెరుగుపడుతుంది. దీని కోసం మీరు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ రసాన్ని పిండాలి అందులో ఒక అంగుళం అల్లం ముక్కను తురుముకోవాలి. ఈ పానీయం క్రమం తప్పకుండా తాగాలి, ప్రతిరోజూ సుమారు 2 గ్లాసులు, కనీసం 2 నెలలు వాడితే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. 

 
దాల్చిన చెక్క.. 

దాల్చిన చెక్కను డిటాక్స్ డ్రింక్స్‌తో కలిపి తాగడం వల్ల కూడా పండుగ సీజన్ తర్వాత బరువు తగ్గవచ్చు. బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలో ఇది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి దానిని ప్రతిరోజూ రాత్రి నిద్రవేళకు ముందు తాగాలి. ఈ పానీయం జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

దోసకాయ-పుదీనా..

దోసకాయ, పుదీనా రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని నీటిలో కలిపినప్పుడు, అవి వాటిలోని పోషకాలను నీటిలోకి విడుదల చేస్తాయి. ఈ డిటాక్స్ డ్రింక్‌ తద్వారా మరింత పోషకమైనదిగా అవుతుంది. ఈ పానీయాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ జీర్ణవ్యవస్థ బలపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీని కోసం, ఒక గ్లాస్ లేదా బాటిల్ తీసుకొని అందులో కొన్ని దోసకాయ ముక్కలు, పుదీనా ఆకులు వేసుకొని మీరు రోజంతా కొద్దికొద్దిగా తాగుతూ ఉంటే శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లి బాడీ హెల్తీగా ఉంటుంది.

యాపిల్,దాల్చిన చెక్క..  

 ఆపిల్, దాల్చిన చెక్కతో చేసిన మ్యాజికల్ డ్రింక్ జీవక్రియ పెంచడమే కాకుండా మీ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. యాపిల్, దాల్చినచెక్కలో ఉండే పోషకాలు మీ శరీరాన్ని డిటాక్సిఫై చేస్తాయి. అంతేకాదు రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. ఇందుకోసం ఒక గ్లాసు నీటిలో యాపిల్ ముక్కలు, దాల్చిన చెక్క వేసి కొన్ని గంటలపాటు అలాగే ఉంచి కొద్దికొద్దిగా తాగాలి. ఇలా చేస్తే శరీరంలోని వ్యర్థాలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉండొచ్చు.  

 

ఇది కూడా చదవండి..వెరికోస్ వెయిన్స్ కు ప్రధాన కారణాలు..?  

ఇది కూడా చదవండి..స్ట్రోక్ కు ప్రధాన కారణాలు..? నివారణ ఎలా..? 

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడే న్యాచురల్ ఫుడ్..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్ 

ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : detoxification-of-the-body body-detox detoxify detoxification how-to-detox-your-body best-way-to-detox-body how-to-detox-the-body how-to-detox-our-body detox-your-body how-to-detox-your-body-at-home benefits-of-detixing-body detox-drinks-to-flush-out-toxins
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com