Air pollution : వాయు కాలుష్యంతో ఏటా 21 లక్షల మంది భారతీయులు బలి..!

షేర్ చేయండి:
Air pollution : వాయు కాలుష్యంతో ఏటా 21 లక్షల మంది భారతీయులు బలి..!

సాక్షి లైఫ్ : ప్రపంచంలోనే వాయు కాలుష్య మరణాలు అధికంగా సంభవిస్తున్న దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. కాలుష్యం కోరల్లో చిక్కుకుని ప్రతి ఏటా సుమారు 21 లక్షల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోతున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ పరిశోధనా సంస్థ ‘హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ (HEI)’ విడుదల చేసిన తాజా నివేదిక హెచ్చరించింది.  

ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

 ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

 దేశంలో గాలి కాలుష్యం (Air Pollution) పీల్చే ప్రతి శ్వాసనూ ప్రమాదకరంగా మారుస్తోంది. గుండె జబ్బులు, మధుమేహం, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులకు వాయు కాలుష్యం ప్రధాన కారకంగా మారుతోంది.

ప్రపంచంలో రెండో స్థానం.. 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం వల్ల నమోదైన 81 లక్షల మరణాల్లో భారత్‌ వాటా దాదాపు 21 లక్షలు (2.1 మిలియన్లు) ఉన్నట్లు దిహెల్త్ ఎఫెక్ట్స్ ఇనిస్టిట్యూట్ (HEI) నివేదిక పేర్కొంది. చైనా (23 లక్షలు) తర్వాత భారత్‌లోనే అత్యధిక మరణాలు నమోదవుతున్నట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మొత్తం మరణాలలో దాదాపు 12 శాతం కేవలం వాయు కాలుష్యం కారణంగానే సంభవిస్తున్నాయి.

చిన్నారులపై తీవ్ర ప్రభావం.. 

వాయు కాలుష్యం కారణంగా ఐదేళ్ల లోపు చిన్నారులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. 2021లో ప్రపంచవ్యాప్తంగా మరణించిన 7 లక్షల మంది చిన్నారుల్లో ఒక లక్షా అరవై తొమ్మిది వేల నాలుగు వందల మంది భారత్‌లోనే చనిపోయారు. ఇండోర్ కాలుష్యం అంటే వంట చెరకు, బొగ్గు వంటి ఇంధనాల వాడకం దీనికి ముఖ్య కారణాలలో ఒకటిగా నివేదిక తెలిపింది.

  2.5 మైక్రోమీటర్ల కంటే తక్కువ వ్యాసం కలిగిన సూక్ష్మ కాలుష్య కారకాలు (PM 2.5) ఊపిరితిత్తులు దాటి నేరుగా రక్తంలోకి ప్రవేశించడం ద్వారా ఈ మరణాలకు ప్రధాన కారణమవుతున్నాయి. దేశంలోని దాదాపు ప్రతి పౌరుడూ WHO నిర్దేశించిన ప్రమాణాల కంటే అధిక కాలుష్యం ఉన్న గాలినే పీలుస్తున్నారని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

వాయు కాలుష్యాన్ని నియంత్రించకపోతే, రాబోయే తరాలపై ఇది మరింత తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని, తక్షణమే గ్రీన్‌హౌస్ ఉద్గారాలను తగ్గించే చర్యలు చేపట్టాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?


ఇది కూడా చదవండి..పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.