హానికరం : పంచామృతంలో నెయ్యి-తేనె ఉంటాయి కదా..?
సాక్షి లైఫ్ : నెయ్యి, తేనె కలపడం విషంగా మారితే, పంచామృతం చేసేటప్పుడు వాటిని ఎందుకు ఉపయోగి స్తారనే సందేహం మీకు రావొచ్చు. పంచామృతం అనేది ఐదు ఆహార పదార్థాల మిశ్రమం. దీనిని పూజ సమయంలో అభిషేకం చేయడానికి ఉపయోగిస్తారు. ఆ తరువాత ప్రసాదంగా ఇస్తారు.
పంచామృతం తయారీకి ప్రధానంగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఉపయోగిస్తారు. పంచామృతం విషపూరితంగా మారక పోవడానికి కారణం నెయ్యి, తేనె సమాన నిష్పత్తిలో కలపకపోవడమే. అలాగే, పంచామృతాన్ని ప్రసాదంగా చాలా తక్కువ పరిమాణంలో వినియోగిస్తారు, సాధారణంగా, కేవలం ఒక టీ స్పూను తీసుకుంటారు. ఇది శరీరానికి దాదాపు హాని కలిగించదు.
తేనె అందించే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నెయ్యి అనేది పాల ప్రోటీన్లు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఏ వంటి పోషకాలుంటాయి. ఇవిమన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతాయి.
పప్పులు, కూరలు, సబ్జీలు, ఖిచ్డీలకు కేవలం ఒక చెంచా దేశీ నెయ్యి జోడించడం ద్వారా వాటి రుచిన్నిపెంచుకోవచ్చు. నెయ్యి మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేయడమే కాకుండా మలబద్ధకాన్ని త్వరగా నయం చేసే దివ్యౌషధంగా కూడా పనిచేస్తుంది.
ఇది కూడా చదవండి.. మైగ్రేన్‌ను ఇలా నివారించవచ్చు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
