FSSAI Bans Use of Ashwagandha Leaves : అశ్వగంధ ఆకులపై నిషేధం.. కేవలం వేర్ల నినియోగానికే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతి..!

షేర్ చేయండి:
FSSAI Bans Use of Ashwagandha Leaves : అశ్వగంధ ఆకులపై నిషేధం.. కేవలం వేర్ల నినియోగానికే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతి..!

సాక్షి లైఫ్ : దేశీయంగాను, అంతర్జాతీయంగాను ఎంతో ఆదరణ పొందిన ఆయుర్వేద మూలిక 'అశ్వగంధ' (Ashwagandha) వాడకంపై భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (FSSAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అశ్వగంధ ఆకులు లేదా వాటి నుంచి తీసిన సారాన్ని (Extracts) హెల్త్ సప్లిమెంట్లు, న్యూట్రాస్యూటికల్స్ వంటి ఆహార ఉత్పత్తులలో వాడటంపై పూర్తి నిషేధం విధించింది. కేవలం అశ్వగంధ వేర్లను (Roots) మాత్రమే వాడుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆయుష్ (Ayush) మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తాజా ఆదేశాలు జారీ చేసింది.  

 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

 

నిషేధానికి గల కారణాలు..?

అశ్వగంధ ఆకులలో 'వితాఫెరిన్-ఏ' (Withaferin A) అనే రసాయన సమ్మేళనం అధిక మోతాదులో ఉంటుంది. దీనివల్ల కాలేయం దెబ్బతినడం (Liver Injury), హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వంటి దుష్ప్రభావాలు కలిగే ప్రమాదం ఉందని పరిశోధనల్లో తేలింది.  

ఆయుర్వేద సంప్రదాయం..  

వేల సంవత్సరాలుగా ఆయుర్వేదంలో అశ్వగంధ వేర్లను మాత్రమే ఔషధంగా వాడుతున్నారు. వేర్లతో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని, అవి సురక్షితమైనవని నిపుణులు నిర్ధారించారు. మార్కెట్లో తక్కువ ధరకు లభించే అశ్వగంధ ఆకులను, వేర్ల పొడిలో కలిపి కల్తీ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కొత్త నిబంధనతో ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట పడనుంది.నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుఈ నిబంధనలను దేశంలోని ఆహార ఉత్పత్తిదారులు (FBOs) అందరూ తప్పనిసరిగా పాటించాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ హెచ్చరించింది. 

"అశ్వగంధ ఉత్పత్తుల తయారీలో కేవలం వేర్లను మాత్రమే వాడాలి. అంతేకాకుండా ఆ మందుల లేబుల్‌పై ఏ భాగాన్ని ఉపయోగించారో స్పష్టంగా పేర్కొనాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆహార భద్రత చట్టం-2006 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం," అని అధికారులు స్పష్టం చేశారు. నిపుణుల భిన్నాభిప్రాయాలు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రముఖ అశ్వగంధ సరఫరా సంస్థలు స్వాగతించాయి. 

అశ్వగంధ ఆకుల వల్ల..

"మా ఉత్పత్తులలో మొదటి నుంచి కేవలం వేర్లనే వాడుతున్నాం. ఈ నిర్ణయం ప్రజారోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది," అని ప్రముఖ సంస్థ 'ఇక్సోరియల్ బయోమెడ్' తెలిపింది. అయితే, మరికొందరు పరిశ్రమ వర్గాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అశ్వగంధ ఆకుల వల్ల పెద్దగా ప్రమాదం లేదని, వాటిపై పూర్తి నిషేధం విధించడం వల్ల దాదాపు 2.5 లక్షల మంది రైతు కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులు అశ్వగంధ సప్లిమెంట్లు కొనే ముందు, బాటిల్ వెనుక ఉన్న లేబుల్‌ను పరిశీలించి.. అది కేవలం వేర్ల (Root extract) తోనే తయారైందని నిర్ధారించుకున్నాకే వాడటం సురక్షితం.  

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.