World’s Top 30 Fastest-Warming Cities : ప్రపంచంలోనే అత్యంత వేడెక్కుతున్న టాప్ 30 నగరాల జాబితాలో హైదరాబాద్..!
సాక్షి లైఫ్ : హైదరాబాద్ నగరంలో కాంక్రీట్ జంగిల్ నానాటికీ విస్తరిస్తుండటం, పచ్చదనం వేగంగా హరించిపోతుండటంతో భాగ్యనగరం తీవ్రమైన పర్యావరణ సంక్షోభం దిశగా పయనిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వాతావరణ ఉష్ణోగ్రతల ముప్పును (Extreme Heat Risk) ఎదుర్కొంటున్న టాప్ 30 నగరాల జాబితాలో హైదరాబాద్ కూడా ఒకటని ప్రముఖ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం (University of Oxford) తాజా అధ్యయనంలో వెల్లడించింది. దేశంలోని ఇతర ప్రసిద్ధ మెట్రో నగరాల కంటే ఇక్కడి నివాసితులు అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల తీవ్రమైన ఆరోగ్య, పర్యావరణ ముప్పును ఎదుర్కొంటున్నారని ఈ పరిశోధన హెచ్చరిస్తోంది.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
నగరంలో ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధాన కారణాలు..
ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా 205 నగరాల్లో నిర్వహించిన ఈ ప్రత్యేక అధ్యయనంలో హైదరాబాద్‌కు సంబంధించిన ఆందోళనకరమైన వాస్తవాలు వెలుగుచూశాయి. నగరంలో వేడి పెరగడానికి నిపుణులు ప్రధానంగా మూడు కారణాలను ఎత్తిచూపుతున్నారు.
నగరీకరణ.. పచ్చదనం క్షీణత: శరవేగంగా జరుగుతున్న పట్టణీకరణ కారణంగా చెట్లు, పచ్చని మైదానాలు కనుమరుగవుతున్నాయి.
జలవనరుల అంతర్థానం..ఒకప్పుడు నగరానికి చల్లదనాన్ని ఇచ్చిన చెరువులు, కుంటలు, ఇతర జలవనరులు పూర్తిగా ఆక్రమణలకు గురికావడం లేదా ఎండిపోవడం పెద్ద మైనస్‌గా మారింది.
ఎత్తైన భవనాలు,మైక్రోక్లైమేట్ మార్పు..నగరంలో విస్తరిస్తున్న బహుళ అంతస్తుల భవనాలు (High-rises) ఇక్కడి స్థానిక వాతావరణాన్ని (Microclimate) పూర్తిగా మార్చేస్తున్నాయి.
ఏసీల వాడకంతో మరింత ముప్పు..!
ఎండల వేడి తట్టుకోలేక నగరవాసులు ఎయిర్ కండిషనర్ల (ACs) పై ఆధారపడటం గణనీయంగా పెరిగింది. అయితే, ఏసీల వల్ల గదుల లోపల తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ, అవి బయటకు విడుదల చేసే విపరీతమైన వేడి గాలి కారణంగా నగర బాహ్య ఉష్ణోగ్రతలు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
ఇతర నగరాలతో పోలిస్తే పరిస్థితి ఎలా ఉందంటే..?
గ్లోబల్ స్కోరు..దాదాపు 77 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా హీట్-రిస్క్ స్కోరు 0.68 గా నమోదైంది.
ప్రపంచ నగరాల సరసన..
ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతల ముప్పున్న కైరో, మనీలా, హోచిమిన్ సిటీ వంటి నగరాల స్కోరు కంటే మన హైదరాబాద్ కేవలం 0.5 నుండి 0.10 పాయింట్లు మాత్రమే తక్కువగా ఉండటం గమనార్హం. అంతేకాదు బ్యాంకాక్, హనోయి వంటి నగరాల కంటే హైదరాబాద్‌లోనే రిస్క్ చాలా ఎక్కువగా ఉంది.
దేశీయ నగరాలతో పోలిస్తే..
నాగ్‌పూర్, మదురై నగరాలు ఎక్కువ ముప్పును ఎదుర్కొంటున్న ప్పటికీ.. ముంబై, బెంగళూరు, చెన్నై, దిల్లీ వంటి దేశీయ మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ పరిస్థితి చాలా ఆందోళన కరంగా ఉందని నివేదిక పేర్కొంది. పెరుగుతున్న కాంక్రీట్ నిర్మాణాల వేడి వల్ల నగరవాసులలో డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ వంటి ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా నగర పౌరులు, పాలకులు స్పందించి పెద్ద ఎత్తున మొక్కలు నాటడం, ఉన్న జలవనరులను కాపాడుకోవడం ద్వారానే భవిష్యత్తులో ఈ ముప్పు నుండి హైదరాబాద్‌ను కాపాడుకోగలమని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
