Eye Drops : రీడింగ్ గ్లాసెస్ తో పనిలేకుండానే చదివేలా.. సరికొత్త ఐ డ్రాప్స్..!
సాక్షి లైఫ్ : వయసు పెరిగే కొద్దీ వచ్చే చూపు మందగింపు అంటే ప్రెస్బయోపియా సమస్యకు వైద్య రంగంలో సరికొత్త పరిష్కారాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇకపై పుస్తకాలు, స్మార్ట్‌ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌లు చూసేటప్పుడు పదే పదే రీడింగ్ గ్లాసెస్ వాడాల్సిన అవసరం లేకుండా, కేవలం కంటి చుక్కల మందు (Eye Drops) ద్వారానే తాత్కాలికంగా స్పష్టమైన చూపును పొందే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇటీవలే అమెరికాకు చెందిన డ్రగ్ నియంత్రణ సంస్థ (US FDA), 'లెంజ్ థెరప్యూటిక్స్' (LENZ Therapeutics) సంస్థ రూపొందించిన నెక్స్ట్ జనరేషన్ కంటి చుక్కల మందు 'విజ్' (VIZZ) కు ఆమోదం తెలిపింది. ఈ డ్రాప్స్ కంటిలో వేసుకుంటే దాదాపు 10 గంటల పాటు అద్దాలు లేకుండానే చిన్న అక్షరాలను కూడా స్పష్టంగా చదవవచ్చని సంస్థ పేర్కొంది.
కంటి చుక్కలు.. అద్దాలలా ఎలా పనిచేస్తాయి..?
ఈ ఐ డ్రాప్స్ 'మియోటిక్స్' (Miotics) అనే ఔషధాల విభాగానికి చెందినవి. ఇవి కంటిలోని పాపను (Pupil) తాత్కాలికంగా కుంచించుకుపోయేలా చిన్నగా చేస్తాయి.
పిన్‌హోల్ ఎఫెక్ట్..కంటిపాప పరిమాణం తగ్గడం వల్ల కంటిపై పడే కాంతి కేంద్రీకృతమై, ఫోకస్ లోతు (Depth of Field) పెరుగుతుంది.
తక్షణ ఫలితం: దీనివల్ల కంటికి దగ్గరగా ఉండే స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లు, పుస్తకాల్లోని చిన్న అక్షరాలు, కంప్యూటర్ స్క్రీన్లు తక్షణమే ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి.
భారత్‌లోనూ తొలి అడుగు..
గత ఏడాది ముంబైకి చెందిన 'ఎంటోడ్ ఫార్మాస్యూటికల్స్' సంస్థ 'ప్రెస్‌వ్యూ' (PresVu) పేరుతో భారతదేశపు మొట్టమొదటి ప్రెస్బయోపియా ఐ డ్రాప్స్‌ను దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టి, వైద్య రంగంలో కొత్త సంచలనానికి తెరతీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదించిన సరికొత్త డ్రాప్స్ దాదాపు 10 గంటల సుదీర్ఘ కాలం పాటు పని చేస్తూ వినియోగదారులకు మరింత ఉపశమనాన్ని ఇస్తున్నాయి.
నిపుణుల సూచనలు.. జాగ్రత్తలు..
తాత్కాలిక ఉపశమనం మాత్రమే..ఈ కంటి చుక్కల మందు కేవలం తాత్కాలికంగా చూపును మెరుగుపరుస్తుంది తప్ప, వయోభారంతో వచ్చే చూపు సమస్యకు ఇది శాశ్వత నివారణ లేదా శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయం కాదు.
రాత్రి వేళల్లో డ్రైవింగ్ వద్దు..ఈ డ్రాప్స్ కంటిపాపను చిన్నగా చేయడం వల్ల రాత్రి పూట వెలుతురును గ్రహించే సామర్థ్యం తగ్గుతుంది. అందుకే ఈ డ్రాప్స్ వేసుకున్న తర్వాత రాత్రి సమయాల్లో వాహనాలు నడపకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వైద్యుల సలహా తప్పనిసరి..నలభై ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరిలో సహజంగా వచ్చే ఈ సమస్యకు, సొంత నిర్ణయాలతో కాకుండా నేత్ర వైద్యుల (Ophthalmologists) పర్యవేక్షణలోనే ఇలాంటి మందులను వాడాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
