Ebola Strain : ఎబోలా కొత్త స్ట్రెయిన్‌కు రష్యా శాస్త్రవేత్తల సరికొత్త వ్యాక్సిన్‌..!

షేర్ చేయండి:
Ebola Strain : ఎబోలా కొత్త స్ట్రెయిన్‌కు రష్యా శాస్త్రవేత్తల సరికొత్త వ్యాక్సిన్‌..!

సాక్షి లైఫ్ : ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక ఎబోలా వైరస్ కొత్త రూపం (స్ట్రెయిన్‌) పై పోరాడేందుకు రష్యా శాస్త్రవేత్తలు సరికొత్త వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న అరుదైన 'బుండిబుగ్యో' (Bundibugyo) స్ట్రెయిన్ నుంచి కూడా ఈ వ్యాక్సిన్ రక్షణ కల్పించగలదని రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్ మురాష్కో వెల్లడించినట్లు దక్షిణాఫ్రికాలోని రష్యా రాయబార కార్యాలయం ప్రకటించింది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బుందిబుగ్యో స్ట్రెయిన్ వల్ల వచ్చే ఎబోలాకు అధికారికంగా ఎలాంటి నిర్దిష్ట చికిత్స లేదా టీకాలు అందుబాటులో లేవు. ఇటువంటి సమయంలో రష్యా చేసిన ఈ ప్రకటన వైద్య రంగంలో ఆశాజనకంగా మారింది.

 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..

 

ప్రపంచవ్యాప్తంగా హై అలర్ట్..

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC), ఉగాండా దేశాల్లో ఎబోలా వైరస్ ఉధృతి తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే మే 17న అంతర్జాతీయ హెల్త్ రెగ్యులేషన్స్ (IHR 2005) కింద దీనిని "అంతర్జాతీయ ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితి" (PHEIC) గా ప్రకటించింది. మరోవైపు, ఆఫ్రికా వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (Africa CDC) కూడా దీనిని ఖండంతర భద్రతా అత్యవసర పరిస్థితిగా (PHECS) అభివర్ణించింది.

ఎబోలా అనేది తీవ్రమైన వైరల్ హెమరేజిక్ ఫీవర్ (శరీరం లోపల, బయట రక్తస్రావం కలిగించే జ్వరం). బుందిబుగ్యో స్ట్రెయిన్ కారణంగా వచ్చే ఈ వ్యాధి అత్యంత ప్రమాదకరమైనదిగా, ఎక్కువ మరణాల రేటును కలిగి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు..

వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి డబ్ల్యూహెచ్‌ఓ (WHO) అత్యవసర కమిటీ మే 22న కీలక తాత్కాలిక సిఫార్సులను జారీ చేసింది.

విమానాశ్రయాల్లో స్క్రీనింగ్..

 ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులలో ఎలాంటి కారణం లేకుండా తీవ్ర జ్వరం వంటి లక్షణాలు ఉంటే గుర్తించేలా సరిహద్దులు, ఎయిర్‌పోర్టులలో నిఘాను తీవ్రం చేయాలని సూచించింది.

ప్రయాణాల నియంత్రణ..

బుందిబుగ్యో వైరస్ ఎక్కువగా వెలుగుచూసిన ప్రాంతాలకు ప్రయాణాలను ప్రస్తుతానికి వాయిదా వేసుకోవాలని ప్రయాణికులను కోరింది.

పొరుగు దేశాలకు ముప్పు..

కాంగో, ఉగాండాలతో సరిహద్దులను పంచుకుంటున్న సౌత్ సూడాన్ వంటి పొరుగు దేశాలకు ఈ వైరస్ వేగంగా వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉందని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  టే..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.