ICMR: గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు..
సాక్షి లైఫ్ : ఇండియాలో ఏటేటా క్యాన్సర్ కేసులు మరింతగా పెరుగుతున్నాయని, ఇందుకు సంబంధించిన మృతుల కేసులు కూడా అధికమవు తున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిర్వహించిన ఓ అధ్యయనాల్లో తెలిపింది. 2015 నుంచి 2019 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా నమోదైన క్యాన్సర్ కేసులను పరిగణలోకి తీసుకుంది. ఈ అధ్యయనంలో గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నట్లు గుర్తించారు పరిశోధకులు.
ఇది కూడా చదవండి..న్యూరోసర్జన్లు వెన్నెముక శస్త్రచికిత్స చేయడానికి కూడా అర్హులే
ఇది కూడా చదవండి..పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణాలు..?
ముఖ్యంగా కేరళ, అస్సాంలో "50శాతం కంటే ఎక్కువ గ్రామీణ జనాభా ఉన్న ప్రాంతాల్లో ప్రతి లక్ష మందికి సగటున 76 మంది పురుషులు, 67 మంది మహిళలు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు" అని అధ్యయనం పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాలైన ఐజ్వాల్, ఈస్ట్ ఖాసీ హిల్స్, పాపుంపరే, కామరూప్ అర్బన్, మిజోరాంలలో క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో అన్నవాహిక క్యాన్సర్ కూడా ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
మెట్రో నగరాల్లో..
మెట్రో నగరాల్లో, ఢిల్లీలో ప్రతి లక్ష మందికి 146 కేసులు నమోదై అత్యధిక కేసుల సంఖ్యను నమోదు చేసింది. అహ్మదాబాద్‌లో పురుషుల్లో 4.7శాతం మహిళల్లో 6.9శాతం కేసుల పెరుగుదల నమోదైంది.
తాజా అంచనాలు..
మరోవైపు, 2024 సంవత్సరానికి మహిళల్లో కొత్తగా నమోదయ్యే క్యాన్సర్ కేసుల సంఖ్య 7,81,277గా, పురుషుల్లో 7,80,822గా అంచనా వేశారు. 2024లో మొత్తం క్యాన్సర్ కేసులు 15,62,099గా అంచనా వేయగా, మరణాల సంఖ్య 8,74,404గా ఉంది.
అధ్యయనంలో, భారతదేశంలో జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం 11.0శాతంగా ఉంది. ఈశాన్య ప్రాంతంలోని మిజోరాంలో ఈ ప్రమాదం పురుషుల్లో 21.1శాతంగా, మహిళల్లో 18.9శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ గణాంకాలు క్యాన్సర్ నివారణ, నియంత్రణ చర్యలను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి..నడక, పరుగు.. ఈ రెండిటిలో ఏది ఉత్తమం..?
ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
