రీసెర్చ్ : కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్న ఆహారం తిన్నా బరువు పెరుగుతారా..?  

షేర్ చేయండి:
రీసెర్చ్ : కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్న ఆహారం తిన్నా బరువు పెరుగుతారా..?  

సాక్షి లైఫ్ : కార్బొహైడ్రేట్స్ తక్కువగా ఉన్న ఆహారం, బరువు తగ్గడం మధ్య సంబంధాన్ని తెలుసుకోవడానికి పరిశోధకులు ప్రత్యేకంగా ఓ అధ్యయనం చేశారు. తక్కువ కార్బొహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకున్న తర్వాత కూడా కొందరు త్వరగా బరువు ఎందుకు పెరుగుతారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. 

 కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్న ఫుడ్..  

కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్న ఆహారం తినడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు అని అనుకుంటారు. అయితే, ఇది అంత సులభం కాదు. తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం కారణంగా చాలా సార్లు బరువు తగ్గుతుంది. కానీ ఆ బరువు కూడా అంతే త్వరగా మళ్లీ పెరుగుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్న ఆహారం తీసుకున్న తర్వాత కూడా బరువు పెరగడానికి కారణం ఏమిటో..? బరువును తగ్గించడానికి ఎలాంటి ఆహార పదార్థాలు సహాయపడతాయో తెలుసుకుందాం.. 

వాటితో పోలిస్తే.. 

అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ నెట్‌వర్క్ ఓపెన్‌లో ప్రచురించిన అధ్యయనంలో మాంసం, అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉన్న వాటితో పోలిస్తే మొక్కల ఆధారిత ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులపై దృష్టి సారించే తక్కువ-కార్బ్ ఆహారాలు అధిక బరువు పెరగకుండా నిరోధించడంలో మరింత ప్రభావవంతంగా ఉన్నాయని కనుగొన్నారు.

ఈ అధ్యయనంలో భాగంగా 1,23,000 మందిపై పరిశోధన చేశారు. మొక్కల ఆధారిత ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, తక్కువగా శుద్ధి చేసిన ధాన్యాలు తినే వ్యక్తులు బరువు పెరిగే ప్రమాదం తక్కువగా ఉందని పరిశోధనలో వెల్లడైంది. ఈ అధ్యయనం బరువును నిర్వహించడానికి  కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్న ఆహారం తినడం మాత్రమే కాదు, ఆ ఆహారంలో ఏమేమి చేర్చుకోవాలో శాస్త్రవేత్తలు సూచించారు. ఆరోగ్యకరమైన బరువు కోసం మీ ఆహారంలో ఎటువంటి ఆహార పదార్థాలను చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మొక్కల ఆధారిత ప్రోటీన్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ ఆహార పదార్థాలు ఆరోగ్యకరమైన బరువును తగ్గించడానికి సహాయ పడతాయి.

బ్రోకలీ.. 

ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి బ్రోకలీ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కలిగిన పదార్థాలుంటాయి. ఫైబర్ ఫుడ్ వల్ల అతిగా తినే సమస్య తగ్గుతుంది.  ఇందులో పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో పోషకాలకు లోటు ఉండదు.

మిల్లెట్స్.. 

మిల్లెట్లలో ఫైబర్, యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కార్బోహైడ్రేట్ తీసుకోవడం పెంచకుండా ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా చేస్తుంది. ఇది బరువును మెయింటైన్ చేయడంలో చాలా సహాయపడుతుంది.

బాదం.. 

బాదంలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి బరువు తగ్గడంతో పాటు అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తాయి. ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు , ప్రోటీన్లు ఇందులో ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది.

అవకాడో.. 

అవోకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు కనిపిస్తాయి. ఇది ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది కాకుండా, అనేక ఇతర విటమిన్లు, ఖనిజాలు ఇందులో ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

బెర్రీస్.. 

బెర్రీస్‌లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. దీని వల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. తద్వారా పెద్దగా ఆకలి అనిపించదు. కాబట్టి బెర్రీస్ కూడా బరువు తగ్గించడంలో బాగా సహాయపడతాయి.

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.