ఇస్కీమిక్ స్ట్రోక్‌కు కొత్త చికిత్స అవసరం.. తాజా అధ్యయనంలో వెల్లడి.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మెదడుకు రక్త సరఫరా అడ్డుకోవడం వల్ల సంభవించే ఇస్కీమిక్ స్ట్రోక్‌కు ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు సరిపోవని, కొత్త చికిత్సా విధానాలు అవసరమని తాజా అధ్యయనం ఒకటి సూచిస్తోంది. ఈ స్ట్రోక్ రోగులకు సకాలంలో చికిత్స అందకపోతే తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి.. డెలివరీకి ముందు గర్భిణీలు "సీ" ఫుడ్ తినకూడదా..? 

ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..? 

ఇది కూడా చదవండి.. మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించే మార్గాలు

 

అమెరికాలోని టేనస్సీ యూనివర్సిటీ హెల్త్ సైన్స్ సెంటర్ ఇస్కీమిక్ స్ట్రోక్ చికిత్సకు కొత్త పద్ధతిని కనుగొనడానికి పరిశోధనలు నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు స్ట్రోక్ ప్రధాన కారణం. కాబట్టి ఆయా మరణాలను నిరోధించడానికి ఈ అధ్యయనానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్ ద్వారా 1.55 లక్షల డాలర్ల  ఆర్థిక సహాయం కూడా అందించారు.


 ఇస్కీమిక్ స్ట్రోక్‌కు ప్రధాన కారణాలలో అధిక రక్తపోటు, మధుమేహం, , అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు, సరిలేని ఆహారపు అలవాట్లు అని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. సాంప్రదాయ చికిత్సలు కొంతమేర సహాయపడుతున్నప్పటికీ, సమర్థవంతమైన ఫలితాల కోసం అధునాతన పరిశోధనలు, కొత్త ఔషధాల అభివృద్ధి అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు.

"స్ట్రోక్ సంభవించిన కొద్దిసమయంలోనే చికిత్స అందిస్తేనే రోగి కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కొత్త చికిత్సా విధానాలపై దృష్టి పెట్టాలి," అని ఓ న్యూరాలజిస్ట్ తెలిపారు. ఈ సమస్యపై అవగాహన పెంచడంతో పాటు, ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ అధ్యయనం వివరాలు, కొత్త చికిత్సలపై పరిశోధనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాబోయే కాలంలో ఈ విషయంలో మరిన్ని అప్‌డేట్‌లు అందుబాటులోకి రానున్నాయి.

 

ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..  

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.