ప్రోటీన్‌తో క్యాన్సర్‌కు చెక్.. కాలేయ క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేసే సరికొత్త అధ్యయనం..!
సాక్షి లైఫ్ : మన ఆరోగ్యాన్ని మనమే నిర్లక్ష్యం చేసుకుంటున్నాం. నిత్యం పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ ఫుడ్స్‌కు అలవాటు పడి కాలేయానికి చేటు తెచ్చుకుంటున్నాం. అయితే, ఆహారపు అలవాట్ల వల్ల వచ్చే కాలేయ సమస్యలు, తద్వారా వచ్చే క్యాన్సర్‌ను నివారించడంలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుందని ఓ కొత్త అధ్యయనంలో వెల్లడైంది. కణాల్లో మంచి ప్రోటీన్ల స్థాయిలను పెంచడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఈ పరిశోధన తేల్చి చెప్పింది.
ఇది కూడా చదవండి.. పిల్లలలో టైప్-2 డయాబెటీస్ కు కారణాలు..?
ఇది కూడా చదవండి.. సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు..
ఇది కూడా చదవండి.. లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రోటీన్ పాత్ర..
సరికొత్త అధ్యయనం ప్రకారం, మన శరీరంలోని కణాల్లో మంచి ప్రోటీన్ (Procyanidin-1) స్థాయి పెరిగి, చెడు ప్రోటీన్ (Procyanidin-2) అదుపులోకి వస్తే, అది రోగనిరోధక వ్యవస్థలోని T-రెగ్యులేటరీ (T-reg) కణాల సంఖ్యను మెరుగుపరుస్తుంది. ఈ ప్రక్రియ వల్ల మన శరీరంలోని యాంటీ-ఆక్సిడెంట్ జన్యువుల రక్షణ వ్యవస్థ మరింత బలపడుతుంది.
ఫలితంగా, క్యాన్సర్ కణాల అభివృద్ధి ఆగిపోతుంది. ఇది లివర్ సిర్రోసిస్ లేదా కాలేయ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన దశకు చేరుకోక ముందే చికిత్స చేయడానికి వీలవుతుంది.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
