Electronic Devices Made Using Cholesterol : శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ.. కొలెస్ట్రాల్ తో ఎలక్ట్రానిక్ పరికరాలు..  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : సాధారణంగా కొలెస్ట్రాల్ అంటే మనకు గుర్తొచ్చేది గుండె జబ్బులు, రక్తనాళాల్లో అడ్డంకులు. కానీ, అదే కొలెస్ట్రాల్ భవిష్యత్తులో మన చేతిలోని స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల వేగాన్ని పెంచబోతోందని మీకు తెలుసా..? మొహాలీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ (INST) శాస్త్రవేత్తలు ఒక వినూత్న ప్రయోగాన్ని విజయవంతం చేశారు. మన శరీరంలో ఉండే ఈ 'కొవ్వు' అణువులను ఉపయోగించి ఎలక్ట్రానిక్ పరికరాలను మరింత శక్తిమంతంగా మార్చవచ్చని వారు నిరూపించారు.

 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..

ఇది కూడా చదవండి..  షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?

 

అసలు ఏంటీ ప్రయోగం..?

ఎలక్ట్రానిక్ పరికరాలు 'స్పిన్‌ట్రానిక్స్' (Spintronics) అనే సాంకేతికత వైపు అడుగులు వేస్తున్నాయి. ఇందులో ఎలక్ట్రాన్ల ప్రవాహం (Charge) మాత్రమే కాకుండా, వాటి భ్రమణాన్ని (Spin) కూడా సమాచార బదిలీకి ఉపయోగిస్తారు. ఇక్కడ కొలెస్ట్రాల్ పాత్ర ఏమిటంటే.. దాని సహజసిద్ధమైన అణు నిర్మాణం వల్ల అది ఎలక్ట్రాన్ల స్పిన్‌ను నియంత్రించే ఒక అద్భుతమైన 'ఫిల్టర్'లా పనిచేస్తుంది.
 
ఎలక్ట్రానిక్ పరికరాల్లో డేటా బదిలీకి 'ఎలక్ట్రాన్ల' ప్రవాహాన్ని వినియోగిస్తారు. అయితే, ఈ ఎలక్ట్రాన్లకు 'స్పిన్' అనే గుణం ఉంటుంది. దీన్ని నియంత్రించడం ద్వారా తక్కువ విద్యుత్ ఖర్చుతో, ఎక్కువ వేగంతో పనిచేసే 'స్పిన్‌ట్రానిక్స్' పరికరాలను రూపొందించవచ్చు. కొలెస్ట్రాల్ అణువులకు ఉండే ప్రత్యేకమైన ఆకృతి ఎలక్ట్రాన్ల స్పిన్‌ను నియంత్రించడానికి ఒక అద్భుతమైన ఫిల్టర్‌లా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ప్రయోజనాలు ఏమిటి అంటే..?

 సాధారణంగా ఇలాంటి సాంకేతికత కోసం ఖరీదైన లోహాలను వాడుతుంటారు. దానికి బదులుగా కొలెస్ట్రాల్ వంటి జీవ సంబంధిత పదార్థాలను వాడటం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఈ విధానంతో తయారయ్యే చిప్‌ల వల్ల కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు తక్కువ వేడిని విడుదల చేస్తాయి. తద్వారా డేటా ప్రాసెసింగ్ వేగం పెరుగుతుంది.

స్పిన్ ఆధారిత పరికరాలు చాలా తక్కువ శక్తితో పనిచేస్తాయి, దీనివల్ల బ్యాటరీ లైఫ్ మెరుగు పడుతుంది. ఇది ప్రయోగశాలలో రసాయనికంగా మార్పులు చేసిన కొలెస్ట్రాల్ అణువులపై జరిగిన పరిశోధన. కాబట్టి, శరీరంలోని కొలెస్ట్రాల్ పెరిగితే సాంకేతికత పెరుగుతుందని భావించకూడదు. ఆరోగ్య రీత్యా కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుకోవడమే ఉత్తమం.

 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.