ఔషధాల తయారీలో కోట్ల రూ. విలువ చేసే తేలు విషం.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : సాధారణంగా బంగారం, వజ్రాలు మాత్రమే ప్రపంచంలో అత్యంత విలువైనవి అని అనుకుంటాం.. కానీ మనకు తెలియనివి.. అంతకంటే విలువైనవి ప్రపంచంలో చాలానే ఉన్నాయి అన్న విషయం కొన్ని సార్లు అర్థమవుతూ ఉంటుంది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా కారణంగా ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నారూ ప్రతి ఒక్కరు. ఇక కొన్ని కొన్ని విలువైన వస్తువుల గురించి పదార్థాల గురించి తెలిసి అవాక్కవడం అందరి వంతు అవుతూ ఉంటుంది.

ఇది కూడా చదవండి.. హోమియోపతి వైద్యంలో క్యేన్సర్ కు చికిత్స ఉందా..? 

చాలా ప్రమాదకరం.. 


తేలు కుట్టినా, పాము కుట్టినా చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇవి కుట్టాయి అంటే చాలు మనిషి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక పాములు తేళ్ల కు సంబంధించిన విషం మనిషి శరీరం లోకి వెళ్తే మనిషి బతకడం చాలా కష్టం. అసలు విషయం ఏమిటంటే..? వీటి విషంతో మనిషికి ఉపయోగపడే  ఔషధాలను తయారు చేస్తున్నారు. తేలు విషం కోట్లలోనే పలుకుతుంది. 

తేలు విషం 80 కోట్ల రూపాయలు..


ఏకంగా లీటరు తేలు విషం 80 కోట్ల రూపాయలు పలుకుతుందట. ఇది ఎంత చెప్పినా నమ్మాలి అనిపించేలా లేదు కదా..! కానీ ఇది నిజమే టర్కీకి చెందిన మెటీన్ ఒరిన్లెర్ అనే వ్యక్తి తేళ్ల కు ఓ ఫామ్హౌస్ ఏర్పాటు చేసిమరీ అందులో వాటిని పెంచుతున్నాడు. వేల సంఖ్యలో తేళ్లను పెంచుతూ.. వాటి విషాన్ని సేకరిస్తున్నాడు. ఆ తర్వాత ఆ విషాన్ని గడ్డకట్టేలా చేసి తరువాత పొడిగా మార్చి విక్రయిస్తున్నాడు. అయితే లీటర్ తేలు విషం ధర 80 కోట్ల పైమాటే.. 

పెయిన్ కిల్లర్.. 

 ఇలా తీసిన తేలు విషాన్ని యాంటీబయోటిక్స్, కాస్మోటిక్స్, పెయిన్ కిల్లర్ ల తయారీలో ఉపయోగిస్తారట. అయితే 300 నుంచి 400 తేళ్ల నుంచి ఒక గ్రాము విషాన్నిసేకరిస్తున్నారు. మీరు ఈ విషం విషయాన్ని నమ్మలేకపోయినా ఇది మాత్రం నిజం..  

ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.