The Hidden Truth Behind Alcohol Snacks : ఆల్కహాల్ తోపాటు తీసుకునే 'మంచింగ్స్' వెనుక అసలు రహస్యం తెలుసా..?
సాక్షి లైఫ్ : మద్యం సేవించే అలవాటు ఉన్న చాలామందిలో ఒక వింత ధోరణి కనిపిస్తుంటుంది. పెగ్గు పడగానే పక్కన చిప్స్, మిక్చర్, ఫ్రైడ్ చికెన్ లేదా పిజ్జా వంటి స్నాక్స్ ఉండాల్సిందే. సాధారణ సమయంలో కంటే మద్యం తాగేటప్పుడు ఉప్పగా, కాస్త కారంగా ఉండే జంక్ ఫుడ్ తినాలనే కోరిక విపరీతంగా పెరుగుతుంది. దీనినే 'మంచింగ్స్' (munchings) అంటారు. అయితే, ఆల్కహాల్ తాగిన వెంటనే శరీరం ఇలాంటి ఆహారాన్ని ఎందుకు కోరుకుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు తాజాగా వెల్లడించారు. దాదాపు పదివేల మందిపై జరిపిన ఒక సుదీర్ఘ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఆల్కహాల్ మన మెదడును తప్పుదోవ పట్టించి, శరీరంలో ప్రోటీన్ లోపం ఏర్పడిందనే భ్రమను కల్పిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
మెదడును మోసం చేసే 'ప్రోటీన్ ఆకలి'..
సాధారణంగా మన శరీరంలో కండరాల పుష్టికి, శక్తికి అవసరమైన ప్రోటీన్లు తగ్గినప్పుడు మెదడు మనల్ని స్వీట్లకు దూరంగా ఉంచి, ఉప్పగా లేదా ఘాటుగా ఉండే ఆహారం వైపు మళ్లిస్తుంది. కాలేయం (Liver) నుంచి విడుదలయ్యే FGF21 అనే హార్మోన్ ఈ ప్రక్రియను నియంత్రిస్తుంది.
మద్యం సేవించినప్పుడు శరీరంలో ఈ FGF21 హార్మోన్ స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. దీనివల్ల మెదడుకు ఒక తప్పుడు సంకేతం అందుతుంది. శరీరానికి వెంటనే ప్రోటీన్ కావాలంటూ మెదడు ఆకలిని ప్రేరేపిస్తుంది. సైన్స్ భాషలో దీనిని 'అపెరిటిఫ్ ఎఫెక్ట్' (Aperitif Effect) అని పిలుస్తారు. పూర్వకాలం నుంచి మద్యం పక్కన స్నాక్స్ నంజుకునే అలవాటు ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిపోవడానికి ఈ జీవక్రియే ప్రధాన కారణం.
'ప్రోటీన్ బెయిట్స్'.. జంక్ ఫుడ్ ప్రమాదం..!
నిజానికి మన మెదడు ఇచ్చే సంకేతాల ప్రకారం మనం గుడ్లు, పప్పుధాన్యాలు, చికెన్ లేదా చేపల వంటి ఆరోగ్యకరమైన ప్రోటీన్ ఆహారాన్ని తీసుకోవాలి. కానీ, మన చుట్టూ సులభంగా దొరికే చిప్స్, ఫ్రైస్, సమోసాలు ఈ జీవసంబంధమైన ఆకలిని క్యాష్ చేసుకుంటున్నాయి.
శాస్త్రవేత్తలు వీటిని 'ప్రోటీన్ బెయిట్స్' (Protein Baits) అని పిలుస్తారు. ఇవి రుచిలో, వాసనలో ప్రోటీన్ ఎక్కువగా ఉన్నట్లు భ్రమ కలిగిస్తాయి కానీ, వీటిలో అసలు ప్రోటీన్లే ఉండవు. కేవలం కొవ్వులు, కార్బోహైడ్రేట్లు అంటే పిండిపదార్థాలు మాత్రమే నిండి ఉంటాయి.
అధిక బరువుకు కారణం..
ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు గమనించిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, తాగేటప్పుడు తీసుకునే స్నాక్స్ ఆధారంగానే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. మద్యం తాగే సమయంలో నిజమైన ప్రోటీన్లు ఉన్న ఆహారం ఉదాహరణకు నట్స్, ఉడికించిన గుడ్లు తీసుకునేవారు తక్కువ కేలరీలు తింటారు. ఎందుకంటే ప్రోటీన్ అందగానే మెదడు ఆకలి సంకేతాలను ఆపేస్తుంది.
చెడు అలవాటు..
ప్రోటీన్ ఎరలైన జంక్ ఫుడ్స్ తినేవారు ఎంత తిన్నా ఆకలి తీరనట్లుగా భావిస్తారు. మెదడు కోరుకున్న ప్రోటీన్ అందకపోవడంతో తింటూనే ఉంటారు. దీనివల్ల శరీరంలోకి అనవసరమైన కేలరీలు చేరి, పొట్ట రావడం, బరువు వేగంగా పెరగడం జరుగుతుంది.
ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా..?
ఆల్కహాల్ వల్ల వచ్చే ఈ నకిలీ ఆకలి నుంచి శరీరాన్ని కాపాడు కోవడానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే.. నూనెలో వేపిన చిప్స్, మిక్చర్లకు బదులుగా వేయించిన శనగలు, ఉడికించిన గుడ్లు, ఉప్పు లేని జీడిపప్పు లేదా బాదం గింజలు, గ్రిల్డ్ చికెన్ వంటి నాణ్యమైన ప్రోటీన్ ఆహారాన్ని ఎంచుకోండి. తాగేటప్పుడు వచ్చే తీవ్రమైన ఆకలి నిజమైంది కాదు.. అది కేవలం ఆల్కహాల్ మీ మెదడుపై ఆడుతున్న ఒక చిన్న కెమికల్ గేమ్ అని గుర్తించి ఆహారాన్ని పరిమితంగా తీసుకోండి.
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
