'బ్రుసెల్లోసిస్' ముప్పునకు ప్రధాన కారణాలు..
సాక్షి లైఫ్ : సాధారణంగా మేకలలో కనిపించే 'బ్రుసెల్లా' అనే బ్యాక్టీరియా పచ్చి పాల ద్వారా మనుషులకు సంక్రమిస్తాయి. ఒకవేళ డెంగ్యూ బాధితులు మేకల పాలు తాగితే, వారికి కూడా బ్రుసెలోసిస్ వస్తుంది. డెంగ్యూ రోగికి బ్రుసెలోసిస్ సోకితే, అది వారి ఆరోగ్య పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తుంది. జ్వరం ఎక్కువ రోజులు కొనసాగడం, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడం వంటి ప్రమాదాలు పెరుగుతాయి.
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
అధ్యయనంలో తేలిన విషయాలు..
ఒక డెంగ్యూ రోగి ప్లేట్‌లెట్స్ పెరగడం కోసం మేక పాలు తాగిన తర్వాత అతనికి బ్రుసెలోసిస్ సోకినట్లు అధ్యయనంలో గుర్తించారు. ఇది అతని డెంగ్యూ లక్షణాలను మరింత జటిలం చేసి, కోలుకోవడం కష్టతరం చేసింది.
నిపుణుల హెచ్చరిక..
మేక పాలు ప్లేట్‌లెట్స్ పెంచగలవనే నమ్మకం అశాస్త్రీయం అని, ముఖ్యంగా పచ్చి పాలు తాగడం వల్ల ఆరోగ్య పరిస్థితి విషమించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు గట్టిగా హెచ్చరిస్తున్నారు.
డెంగ్యూలో ప్లేట్‌లెట్స్ పెరగాలంటే ఏం చేయాలి..?
ప్లేట్‌లెట్స్ స్థాయిలను పెంచడానికి, త్వరగా కోలుకోవడానికి వైద్యులు సూచించే పద్ధతులు కొన్నిఉన్నాయి. అవేంటంటే..?
పుష్కలంగా నీరు, ఎలక్ట్రోలైట్ ద్రావణాలు (ORS) తీసుకోవడం చాలా ముఖ్యం. వైద్య పరీక్షల ద్వారా ప్లేట్‌లెట్ సంఖ్యను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. పోషకాలు సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఎక్కువ శ్రమ లేకుండా పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. వైద్యులు సూచించిన మందులు మాత్రమే వాడాలి. ఎలాంటి గృహ చికిత్సలను (Home Remedies) పాటించే ముందు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..!
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
