ఫాస్టింగ్ కు గుండె జబ్బులకు లింక్ ఏంటి..? రీసెర్చ్ లో వెల్లడైన షాకింగ్‌ నిజాలు..   

షేర్ చేయండి:
ఫాస్టింగ్ కు గుండె జబ్బులకు లింక్ ఏంటి..? రీసెర్చ్ లో వెల్లడైన షాకింగ్‌ నిజాలు..   

సాక్షి లైఫ్ : ఆరోగ్యానికి ఉపవాసం చాలా మేలు చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ దీనివల్ల కొన్నిరకాల సమస్యలూ వస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వారంలో ఓ రోజు ఉపవాసం ఉండడం వల్ల అధిక కొలస్ట్రాల్‌ తోపాటు  క్యాలరీలు ఖర్చవ్వుతాయని గతంలో అనేక పరిశోధనలు తెలిపాయి. ఉపవాసం ఆరోగ్యానికి సరైనది కాదని యూఎస్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజా పరిశోధనలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.  

గుండె జబ్బులు..  

భోజన సమయాన్ని ఎనిమిది గంటలకు తగ్గిస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువని పరిశోధకులు అంటున్నారు. దీనికారణంగా గుండె జబ్బులతో మరణించే అవకాశాలు 91శాతం పెరుగుతుందని వారు వెల్లడిస్తున్నారు. చికాగోలోని అమెరికన్‌ హార్ట్‌ అసోసీయేషన్‌ ఈ తాజా అధ్యయన ఫలితాలను ప్రచురించింది.

ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవారు ఎలాంటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి..?  


 ఫాస్టింగ్ ఉండడం.. 

 ఫాస్టింగ్ ఉండడం అనేది జీవనశైలిలో భాగం చేసుకుంటే బరువు అదుపులో ఉంటుందని, ఇలా చాలమంది బరువు తగ్గిన దాఖాలాలు కూడా ఉన్నాయని, ఇందుకు సంబంధించి ఇప్పటికే నిరూపితమైన అధ్యయనాల ఫలితాలను గురించి పలువురు శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్నారు.

ఈ అధ్యయనంలో.. 

 20 వేల మందిపై చికాగో శాస్త్రవేత్తల బృందం యూఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ చెందిన నెషనల్‌ హెల్త్‌ అండ్‌ న్యూట్రిషన్‌  ప్రత్యేకంగా అధ్యయనం నిర్వహించింది. 12 నుంచి 16 గంటల వరకు అప్పడప్పుడూ ఆహారం తీసుకోని వారి మధ్య, ఆహారం తీసుకున్న వారి  మద్య ఉన్న తేడాను పరిశీలించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారి  సగటు వయసు 48 సంవత్సరాలు. అప్పుడప్పుడూ ఉపవాసం చేస్తున్న వారిలో మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధ సమస్యల ప్రభావం తక్కువుగా ఉన్నట్లు గుర్తించారు. 
 
అయితే నిర్ణిత సమయంలో ఆహారం తీసుకునే వారితో కంపేర్ చేస్తే కొన్ని గంటల సమయానికి ఆహారాన్ని పరిమితం చేసిన వారిలో పలు తేడాలు  కనిపించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఐతే వీరిలో హార్ట్ వ్యాజల్ ప్రోబ్లమ్స్ కారణంగా చనిపోయే అవకాశం ఉన్నట్లు తేలిందని వారు వెల్లడిస్తున్నారు.

 2003 నుంచి 20019 వరకు ఈ అధ్యయనాన్ని పరిశోధకులు చేశారు.  
2003- 20019 మధ్య చనిపోయిన బాధితుల మరణాల గణాంకాల  ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఇది ఎంత వరకు వాస్తవం అనేదానిపై మరింత లోతుగా పరిశోధన చేయాల్సిఉందని యూకే ప్రో. కీత్‌ ఫ్రాయిన్‌ తెలిపారు.  

ఆరోగ్యానికి హానికరం.. 

ఉపవాసం ఆరోగ్యానికి హానికరం అనడం సరైనది కాకపోవచ్చిని అన్నారు. ఇది ఎంత వరకు నిజం అనేదానిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి  ఉందని ప్రో. కీత్‌ ఫ్రాయిన్‌ చెబుతున్నారు. ఉపవాసం చేసిన తీరును వారి అలవాట్లను కూడా లెక్కలోకి తీసుకోవాలని ప్రో. కీత్‌ ఫ్రాయిన్‌ అంటున్నారు.  

ఇది కూడా చదవండి.. రెయిన్‌బో బేబీ అంటే ఏమిటి..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.