అపెండిక్స్ క్యాన్సర్ ప్రమాదం ఎలాంటి వారిలో ఎక్కువగా పెరుగుతోంది..  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మిలీనియల్స్ (సుమారు 1981-1996 మధ్య పుట్టినవాళ్లు) లో అపెండిక్స్ క్యాన్సర్ (Appendix Cancer) ప్రమాదం గణనీయంగా పెరుగుతోందని ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక అధ్యయనంలో తేలింది. అయితే, ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండటం, చాలా సందర్భాలలో ఇది అనుకోకుండా బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. 

ఇది కూడా చదవండి.. క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..? 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?  

ఇది కూడా చదవండి.. లేట్ నైట్ లో ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు ఎందుకు..?

మిలీనియల్స్‌లో..? 
 
మిలీనియల్స్‌లో అపెండిక్స్ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.ఈ వ్యాధి లక్షణాలు చిన్నపాటి సమస్యల్లా కనిపిస్తాయి. చాలా సందర్భాలలో అపెండిక్స్ క్యాన్సర్‌ను గుర్తించేసరికి అది ముదిరి పోతుంది. అపెండిక్స్ క్యాన్సర్ గురించి చాలామందికి సరిగా అవగాహన లేదు. అపెండిక్స్ అనేది శరీరానికి పనికిరాని అవయవమని, దాని వల్ల వచ్చే ఏకైక సమస్య అపెండిసైటిస్ మాత్రమేనని చాలామంది భావిస్తారు. కానీ, ఇది నిజం కాదు.

తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో, 50 ఏళ్లలోపు వారిలో అపెండిక్స్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని వెల్లడైంది. ముఖ్యంగా, జెన్-ఎక్స్ (Gen X) అంటే 1965-1980 మధ్య జన్మించిన వాళ్లు (ప్రస్తుతం వారి వయస్సు 45-60 మధ్య ఉండవచ్చు)మిలీనియల్స్ (Millennials) 1981-1996 మధ్య పుట్టినవాళ్లు(వీరి వయస్సు ప్రస్తుతం 29-44 ఏళ్లు ఉండవచ్చు) ఈ రెండు కేటగిరీల వారికే అపెండిక్స్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని సరికొత్త అధ్యయనాలు సూచిస్తున్నాయి.

 

ఇది కూడా చదవండి.. వంట నూనెకు చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి లింక్ ఏంటి..?

 ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.