Wildfire Smoke : తల, మెడ క్యాన్సర్లకు కారణమవుతున్న కార్చిచ్చు పొగ..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన కారకాలతోనే క్యాన్సర్‌ వస్తుందని ఎక్కువమంది భావిస్తుంటారు. కానీ, అడవుల్లో చెలరేగే మంటల (Wildfire Smoke) నుంచి వెలువడే దట్టమైన పొగ కూడా తల, మెడ భాగాల్లో క్యాన్సర్లకు దారితీస్తుందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన ఒక విస్తృత అధ్యయనంలో ఈ దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

ప్రధాన కారణం పీఎం 2.5 కణాలే..

అడవులు దహనమైనప్పుడు వచ్చే పొగలో అత్యంత సూక్ష్మమైన పీఎం 2.5 (PM 2.5) కణాలు భారీగా ఉంటాయి. ఇవి మానవ కేశం మందం కంటే చాలా చిన్నవిగా ఉండటం వల్ల, శ్వాస ద్వారా నేరుగా మన శరీరంలోకి చేరుకుంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ట్రాఫిక్ వల్ల వచ్చే వాహనాల కాలుష్యం కంటే ఈ కార్చిచ్చు పొగ కాలుష్యం 10 రెట్లు ఎక్కువ ప్రమాదకరం. ఈ విషపూరిత కణాలను పీల్చడం వల్ల శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలతో పాటు గొంతు, తల, మెడ భాగాల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం తీవ్రంగా పెరుగుతుంది.

ఇది కూడా చదవండి..Pre-diabetes : ప్రీ డయాబెటిస్‌ను ఎలా రివర్స్ చేయాలి..?
ఇది కూడా చదవండి..Chia Seeds vs Flaxseeds : గుండె పదిలంగా ఉండాలంటే.. చియా సీడ్స్ మంచిదా..? అవిసె గింజలు మంచిదా..?

హార్వర్డ్ అధ్యయనంలోని ముఖ్యాంశాలు..

గత 16 ఏళ్ల డేటాను విశ్లేషించిన హార్వర్డ్ పరిశోధక బృందం 'ద లాంగోస్కోప్' మెడికల్ జర్నల్‌లో ప్రచురితం అయింది. ఇందులో పలు కీలక విషయాలను వెల్లడించింది. కార్చిచ్చు పొగ బారిన పడేవారిలో తల, మెడ క్యాన్సర్ల ముప్పు సాధారణం కంటే 6 శాతం ఎక్కువగా ఉంటుంది. క్రమం తప్పకుండా ఏటా ఈ తరహా కాలుష్యానికి గురయ్యేవారిలో ఈ ముప్పు ఏకంగా 41 శాతానికి పెరుగుతుందని గుర్తించారు.

అందరికీ క్యాన్సర్ వస్తుందా..?

పొగ పీల్చిన ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ వస్తుందని దీని అర్థం కాదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. అయితే ముప్పు తీవ్రత మాత్రం పెరుగుతుంది. క్యాన్సర్ రావడం అనేది ఆ వ్యక్తి వయసు, వారి ఆరోగ్య పరిస్థితి, ధూమపానం అలవాటు వంటి ఇతర ప్రమాద కారకాలపై కూడా ఆధారపడి ఉంటుంది.

వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన కరువు పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా అడవుల్లో మంటల ఘటనలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణతో పాటు, వాయు కాలుష్యం బారి నుంచి ప్రజలను రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని వైద్య నిపుణులు నొక్కిచెబుతున్నారు.

ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.