జుట్టుకు నూనె పెట్టే విషయంలో మీరు ఈ తప్పు చేస్తున్నారా..?
సాక్షి లైఫ్ : పొడవాటి, ఒత్తుగా ఉండే జుట్టు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే, మన పెద్దలు చెప్పిన కొన్ని పద్ధతులు నేటి కాలంలో సరైనవి కాదని నిపుణులు చెబుతున్నారు. అటువంటి వాటిలో ఒకటి షాంపూ చేసిన వెంటనే జుట్టుకు నూనె పెట్టడం.
చాలామంది చేసే ఈ పద్ధతి వల్ల జుట్టుకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. షాంపూ చేసిన వెంటనే నూనె పెట్టడం వల్ల కలిగే నష్టాలు, దీనికి సరైన పరిష్కారాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
షాంపూ తర్వాత నూనె పెట్టడం వల్ల కలిగే నష్టాలు..
షాంపూతో జుట్టును శుభ్రం చేసినప్పుడు, తలపై ఉన్న రంధ్రాలు (pores) తెరుచుకుంటాయి. ఈ సమయంలో మీరు నూనె రాస్తే, అది గాలిలోని దుమ్ము, ధూళి, కాలుష్య కారకాలను త్వరగా గ్రహిస్తుంది. ఇది తల చర్మంపై పేరుకుపోయి, ఈ సమస్యలకు కారణమవుతుంది:
జుట్టు రాలడం పెరుగుతుంది: దుమ్ము పేరుకుపోవడం వల్ల రంధ్రాలు మూసుకుపోయి, జుట్టు మూలాలకు ఆక్సిజన్, పోషకాలు అందకుండా పోతాయి. దీనివల్ల జుట్టు బలహీనపడి, ఎక్కువగా రాలిపోతుంది.
చుండ్రు సమస్య: తల మీద పేరుకుపోయిన దుమ్ము, చెమట కారణంగా చుండ్రు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. జుట్టు పాడవుతుంది: తడిగా ఉన్న జుట్టు చాలా సున్నితంగా ఉంటుంది. ఈ సమయంలో నూనె రాసి గట్టిగా దువ్వినా, ముడి వేసినా జుట్టు విరిగిపోవడం జరుగుతుంది.
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
