గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని ముందుగా ఎలా గుర్తించాలి..?
సాక్షి లైఫ్ : నేటితరంలో ప్రజల జీవనశైలి చాలా దారుణంగా మారుతోంది. జంక్ ఫుడ్, రాత్రి సమయంలో ఆలస్యంగా మేల్కొని ఉండటం, స్క్రీన్‌పై గంటల తరబడి గడపడం, పరిశుభ్రత పాటించకపోవడం వల్ల ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. అటువంటివాటిలో క్యాన్సర్ ఒకటి. ఇటీవల క్యాన్సర్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.
ఇది కూడా చదవండి.Women health : ప్రీ-మెనోపాజ్ కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయి..? అవేంటి..?
ఇది కూడా చదవండి.డయాబెటిక్ రెటినోపతిపై అవగాహన అవసరం..
ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
క్యాన్సర్ లో అనేక రకాలు ఉన్నాయి, వీటిని శరీరంలోని వివిధ భాగాలలో సంభవిస్తాయి. కాబట్టి ఒక్కోరకం క్యాన్సర్ ను ఒక్కోపేరుతో పిలుస్తారు. గర్భాశయ క్యాన్సర్ అనేది తీవ్రమైన క్యాన్సర్లలో ఒకటి, ఇది మహిళలకు చాలా ప్రాణాంతకం. కాబట్టి తప్పనిసరిగా ఈ వ్యాధి గురించి అవగాహన అవసరం.
గర్భాశయ క్యాన్సర్ అంటే ఏమిటి?
మహిళల పునరుత్పత్తి అవయవాలను ప్రభావితం చేసే ఐదు తీవ్రమైన క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ ఒకటి. స్త్రీల గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ ప్రారంభమైనప్పుడు, దానిని గర్భాశయ క్యాన్సర్ అంటారు. గర్భాశయ క్యాన్సర్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్ పివి) అనే వైరస్ వల్ల వస్తుంది. హెచ్ పివి సోకిన స్త్రీలకు గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
ముందుగా గుర్తించి..
కొన్ని వ్యాధులు శరీరంలో ఎటువంటి నిర్దిష్ట లక్షణాలు లేకుండానే కనిపిస్తాయి. మనం తెలుసుకునే సమయానికి, పరిస్థితి మరింత దిగజారిపోతుంది. గర్భాశయ క్యాన్సర్ కూడా అలాంటి ఒక వ్యాధి. ఇది నెమ్మదిగా పెరుగుతుంది, కానీ మనం శరీరం సంకేతాలను అర్థం చేసుకుంటే దానిని ముందుగా గుర్తించి చికిత్స చేయవచ్చు. సాధారణంగా ఈ వ్యాధి 35 సంవత్సరాల తర్వాత మహిళల్లో కనిపిస్తుంది.
ఈ లక్షణాలతో గుర్తించవచ్చు..
తరచుగా మూత్రవిసర్జన
తెల్లటి స్రావం
గుండెల్లో మంట, విరేచనాలు
రక్తస్రావం
ఆకలి లేకపోవడం లేదా చాలా తక్కువగా తినడం
చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది
పొత్తి కడుపులో నొప్పి లేదా వాపు
జ్వరం, నీరసం
శృంగారం సమయంలో నొప్పి
శృంగారం తర్వాత రక్తస్రావం
ఋతుక్రమ సమయంలో సాధారణం కంటే ఎక్కువ రక్తస్రావం
వెన్నునొప్పి
యోని వద్ద గడ్డలు..
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..?
ఇది కూడా చదవండి.. సమ్మర్ లో చర్మ సంరక్షణ ఎలా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
