సాక్షి లైఫ్ : జుట్టు సంరక్షణ కోసం పలు రకాల చిట్కాలను పాటిస్తే.. హెయిర్ ఫాల్ సమస్య ను అధిగమించవచ్చు. అంతేకాదు మీ వయసు పెరిగేకొద్దీ జుట్టు రాలే సమస్య తలెత్తకుండా ఉంటుంది. అందుకోసమే శిరోజాల సంరక్షణకు తప్పనిసరిగా చేయాల్సినవి.. చేయకూడనివి తెలుసుకోవాలి.. అవేంటంటే..?
వేడి నీరు మీ జుట్టుకు సహజ నూనెలను తొలగిస్తుంది, ప్రత్యేకించి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటే. ఇది మీ జుట్టుకు సహజమైన, విలువైన నూనె లేకుండా చేస్తుంది. దీనికారణంగా హెయిర్ పొడిగా, పెళుసుగా కనిపిస్తుంది. వేడి నీరు మీ స్కాల్ప్ ను పొడిగా చేస్తుంది. తద్వారా దురద, చుండ్రుకు దారితీస్తుంది. వేడి నీరు మీ శిరోజాల మూలాలను బలహీనపరుస్తుంది. ఫలితంగా, మీ జుట్టు చిట్లిపోయి, రాలిపోతుంది.
- షాంపూ తో తలస్నానం చేసేటప్పుడు వేడి నీటిని ఉపయోగించకూడదు.
- ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు, గుడ్లు, ప్రొటీన్స్, హెర్బల్ షాంపూల వల్ల శిరోజాలు పెరుగుతాయని భ్రమపడతారు. కానీ ఇవి కేశాలకు పోషక విలువలను మాత్రమే కలుగజేస్తాయి.
-నార్మల్ హెయిర్ ఉన్న వాళ్ళు కోడిగుడ్డు సొనను బాగా గిలకొట్టి, తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
- సాధ్యమయినంతవరకు శిరోజాలకు సూర్యరశ్మి తగలకుండా జాగ్రత్తపడాలి.
ఇది కూడా చదవండి..జింక్ లోపాన్ని అధిగమించడానికి ఎలాంటి ఆహారాలు అవసరం..?
ఇది కూడా చదవండి..లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీలు ఎలాంటివారికి చేస్తారు..?
ఇది కూడా చదవండి..వాతావరణ మార్పలు దోమల వల్ల కలిగే వ్యాధుల వ్యాప్తిని ఎలా ప్రభావితం చేస్తాయి..?
-సూర్యరశ్మిలోని అతి నీలలోహిత కిరణాలవలన వెంట్రుకలు బిరుసుగా తయారవుతాయి. దానివలన శిరోజాలు త్వరగా నెరుస్తాయి.
- ఆయిలీ హెయిర్ ఉన్న వాళ్ళు ఆహారంలో నూనె, కొవ్వు అధికంగా ఉన్న పదార్థాలు తగ్గించాలి.
-డ్రై హెయిర్, నార్మల్ హెయిర్ కలవారికంటే ఆయిలీ హెయిర్ కలిగినవారు తరచుగా తలస్నానం చేస్తుండాలి.
-శిరోజాల చివరలు కత్తిరిస్తే, త్వరగా పెరుగుతాయనే అపోహ కొందరికి ఉంటుంది. కానీ ఇది అపోహ మాత్రమే.
-కేశాల చివరలు కత్తిరిస్తే కేశం పూర్తిగా చిట్లిపోకుండా నివారించవచ్చు. అంతే..
-జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే దృఢంగా ఉండే దువ్వెనలు వాడకూడదు.
-సాధ్యమైనంత వరకు మృదువయిన హెయిర్ బ్రష్‌లను, పళ్ళు దూరంగా ఉండే దువ్వెనను ఉపయోగిస్తే శిరోజాలు త్వరగా రాలిపోకుండా ఉంటాయి.
-వెంట్రుకలకు కలర్ వేసేటప్పుడు అమోనియా లేని న్యాచురల్ కలర్ మాత్రమే వాడాలి.
అమోనియా కలిగిన హెయిర్ కలర్ వాడడంవల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది.
-జడ బిగించి వేసుకున్నట్లయితే శిరోజాలు రాలిపోతాయి.
-ఆరోగ్యవంతమైన శిరోజాల కోసం ఆహారంలో విటమిన్ ఎ, బి అధికంగా ఉండేటట్లు చూసుకోవాలి.
ఎండలో ఎక్కువసేపు ఉండాల్సి వస్తే కాటన్ క్యాప్ వాడడం మంచిది.
జీడిగింజలను పగులగొట్టి నువ్వుల నూనెలో వేసి మరిగించి తలకు రాసుకుంటే శిరోజాలు క్రమంగా నల్లబడతాయి.
-నిమ్మచెక్కలను బాగా ఎండబెట్టి, పొడి చేసి, దాన్ని సీకాయ పొడిలో కలుపుకొని తల స్నానం చేస్తే శిరోజాలు చక్కని మెరుపును సంతరించుకుంటాయి.
-పేనుకొరుకుడు ఉన్న ప్రదేశంలో మందార పువ్వులతో చక్కగా మర్దనా చేసినట్లయితే, చక్కని ఫలితం పొందవచ్చు.
-నువ్వుల నూనె, ఉసిరికాయల రసం సమభాగాలుగా కలిపి, కాచి, చల్లార్చి ప్రతిరోజు తలకు రాసుకుంటే శిరోజాలు తెల్లవెంట్రుకలు రావు.
ఇది కూడా చదవండి..భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి..?
ఇది కూడా చదవండి..తగినంత నిద్ర లేకపోతే మెదడుపై ఎలాంటి ప్రభావం కనిపిస్తుంది..?
ఇది కూడా చదవండి..ఒత్తిడిని నివారించాలంటే ఎంత సమయం నడవాలి..?
ఇది కూడా చదవండి..ప్రతిరోజూ 30 నిమిషాలు నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..బ్లాక్ కాఫీ మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
-జుట్టు పల్చగా ఉంటే ప్రతిరోజు పచ్చిపాలను కుదుళ్ళకు బాగా రాసి, గంట తర్వాత, తల స్నానం చేస్తే కొద్దిరోజుల్లోనే జుట్టు విపరీతంగా పెరుగుతుంది.
- పోషకాహారంతో పాటు సంరక్షణ జాగ్రత్తలు పాటిస్తే జుట్టుకి పెరుగుదల ఉంటుంది.
-పౌష్టికాహారం వల్ల శిరోజాలకు కావలసిన విటమిన్స్ అందుతాయి. ఇవి జుట్టు రాలడాన్ని అరికట్టి పెరిగేందుకు సహాయపడతాయి.
- జుట్టుకి స్వచ్ఛమైన కొబ్బరినూనెని వేడిచేసి గోరువెచ్చటి నూనెతో తలకి మసాజ్ చేయాలి. ఆ తరువాత తలస్నానం చేస్తే జుట్టుకి మంచి రక్తప్రసరణ జరిగి ఒత్తయిన జుట్టు వస్తుంది.
- మానసిక ఇబ్బందులకు దూరంగా ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా మానసిక కారణాల వల్లే జుట్టు ఊడుతుంది.
-ఆయిల్ మసాజ్ చేసుకున్న తరువాత తలస్నానం చేసేందుకు మంచి షాంపూలను ఎంచుకోవాలి. తలస్నానం తరువాత మంచి కండీషనర్ పెట్టుకోవాలి.
-ఇలా పెట్టడం వల్ల జుట్టు రాలకుండా దృఢంగా ఉంటుంది.
ఇలాంటి సులభమైన చిట్కాలు పాటించడం వల్ల శిరోజాలకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com