భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి..?

షేర్ చేయండి:
భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి..?

సాక్షి లైఫ్ : భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసుల గురించి ప్రజలను హెచ్చరిస్తున్నారు వైద్యనిపుణులు. ధూమపానం, మద్యపానం ముఖ్యమైన ప్రమాద కారకాలు, కామెర్లు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు. “ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) ప్రతిఏటా నవంబర్‌ నెలను ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అవేర్‌నెస్ నెలగా పాటిస్తోంది. భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అమెరికాలో 4వ అత్యంత తీవ్రమైన వాటిలో  ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అని పరిశోధకులు చెబుతున్నారు. 

ఈ క్యాన్సర్ చాలా ప్రాణాంతకమైంది,  దీనిపై చాలామందికి అవగాహన తక్కువగా ఉన్నందున మనుగడ రేటు తక్కువగా ఉంది. దీనికి చికిత్స సమయానికి తీసుకోలేకపోవడంతోనే చాలామంది చనిపోతున్నారు. 20 శాతం కంటే తక్కువ మంది రోగులు సరైన సమయంలో చికిత్స చేయించుకుంటున్నారు. 

ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోప‌తి అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?.. 

ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు

ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?

మిగిలిన వారు చాలా ఆలస్యంగా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ విషయంలో బరువు తగ్గడం, కడుపు నొప్పి, కామెర్లు, వంటి లక్షణాలు కనిపిస్తాయి. “మధుమేహం ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి, సకాలంలో ఈ సమస్యను గుర్తిస్తే నయం చేయవచ్చని వైద్యనిపుణులు వెల్లడియస్తున్నారు. చాలా మంది రోగులు ఎక్కువగా 4వ దశలోనే క్యాన్సర్ ను గుర్తిస్తున్నారు. అటువంటివారే ఎక్కువగా ఆసుపత్రికి వస్తున్నారని అంటున్నారు డాక్టర్లు.

ధూమపానం, అధిక ఆల్కహాల్ వినియోగం, పాశ్చాత్య శైలికి ఆహారం, ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగం వంటివి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కారణమయ్యే ప్రమాద కారకాలు. కాబట్టి ఇలాంటివాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. 

 

ఇది కూడా చదవండి..ఆక్యుపంక్చర్ చికిత్సలో మందులు లేకుండా మధుమేహం నయం అవుతుందా..?

ఇది కూడా చదవండి..చేతి పరిశుభ్రత వల్ల ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..గ్లోబల్ హ్యాండ్‌వాషింగ్ డే ప్రాముఖ్యత..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.