Prevent preterm birth : ముందస్తు ప్రసవాన్ని నివారించడానికి జాగ్రత్తలు
సాక్షి లైఫ్ : గర్భధారణ సమయంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం ద్వారా ముందస్తు ప్రసవం ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు డాక్టర్ సలహా మేరకు ప్రతి నెలా రెగ్యులర్ చెకప్‌లకు హాజరు కావడం తప్పనిసరి. గర్భధారణ సమయంలో అవసరమైన ఫోలిక్ యాసిడ్, ఐరన్ ,కాల్షియం సప్లిమెంట్లతో కూడిన పౌష్టికాహారం తీసుకోవాలి. బరువు పెరగడంపై దృష్టి పెట్టాలి. మూత్ర నాళ ఇన్ఫెక్షన్లు రాకుండా తగినంత నీరు తాగాలి. దంత ఆరోగ్యాన్ని (Dental Health) జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే చిగుళ్ల ఇన్ఫెక్షన్లు కూడా ప్రమాదాన్ని పెంచుతాయి.
ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ..
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..?
అవసరమైతే ధ్యానం లేదా చిన్నపాటి వ్యాయామాలు చేయాలి అందుకోసం డాక్టర్ అనుమతి తీసుకోవాలి. మానసిక ఒత్తిడి (Stress) లేకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. గర్భధారణ సమయంలో పొగ, మద్యం, మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. సెకండరీ స్మోక్‌కు (పొగ పీల్చే ప్రదేశాలకు) కూడా వెళ్లకూడదు.
గర్భం చివరి త్రైమాసికంలో ముఖ్యంగా వైద్యులు సూచిస్తే, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. పొత్తికడుపులో తరచుగా వచ్చే నొప్పి, రక్తస్రావం, లేదా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ (Amniotic Fluid) కారడం వంటి ముందస్తు ప్రసవ లక్షణాలు ఏమైనా కనిపిస్తే, వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. ముందస్తు ప్రసవాన్ని నివారించడంలో తల్లి ఆరోగ్యం,ఆమె తీసుకునే జాగ్రత్తలే కీలకం.
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
