Risk of Brain Shrinkage in Women : మెనోపాజ్ మహిళల్లో మెదడు కుంచించుకుపోయే ప్రమాదం.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : నలభై ఏళ్లు దాటినతర్వాత మహిళల జీవితంలో మెనోపాజ్ దశ అనేది ఒక కీలకమైనది. ఈ పరిస్థితి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్య తలెత్తుతుంది. అయితే ఇది కేవలం శారీరక మార్పులకు మాత్రమే పరిమితం కాకుండా, మెదడు ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ తాజాగా జరిపిన పరిశోధనలో వెల్లడైంది. మెనోపాజ్ దశకు చేరుకున్న మహిళల్లో మెదడులోని కొన్ని భాగాల పరిమాణం (Brain Volume) తగ్గుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..! 

 

పరిశోధనలో.. 

మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్దీ ముఖ్యంగా నాలుగు పదుల వయసు దాటాక ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ల స్థాయిలు తగ్గుముఖం పడతాయి. ఈ హార్మోన్ల మార్పుల వల్ల మెదడులోని కీలక భాగాలు కుంచించుకుపోతాయని, దీని కారణంగా జ్ఞాపకశక్తి మందగించడం, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు చెబుతున్నారు.

 మెనోపాజ్ తర్వాత మెదడులోని 'గ్రే మ్యాటర్' పరిమాణం తగ్గుతున్నట్లు స్కానింగ్ రిపోర్ట్స్ లో తేలింది. ఇది ఆలోచనా శక్తిపై ప్రభావం చూపుతుంది. మెదడు కణాల రక్షణలో ఈస్ట్రోజెన్ కీలక పాత్ర పోషిస్తుంది. మెనోపాజ్ సమయంలో ఈ హార్మోన్ తగ్గడం వల్ల మెదడు కణాలు బలహీనపడతాయి. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ మెదడు పరిమాణం తగ్గడం సహజమే అయినా, మెనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో ఈ మార్పు వేగంగా జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

 మెనోపాజ్ అనేది..

 మెనోపాజ్ అనేది కేవలం సంతానోత్పత్తి సామర్థ్యం ముగియడం మాత్రమే కాదు, ఇది మెదడు పనితీరులో వచ్చే కీలక మార్పు. కాబట్టి దీనిపై మహిళలు అవగాహన పెంచుకోవాలని కేంబ్రిడ్జ్ పరిశోధక బృందం సూచిస్తోంది. మెనోపాజ్ పరిస్థితిని ఎదుర్కోవడానికి మహిళలు మధ్య వయసు నుంచే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని వారు వెల్లడిస్తున్నారు.

 క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి. మెంటల్ ఎక్సర్‌సైజ్ వంటివి కూడా చేయాలి.. అందులోభాగంగా పజిల్స్ పూర్తి చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా మెదడును చురుగ్గా ఉంచుకోవడానికి వీలుంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.