మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదానికి కారణాలు ఏమిటంటే.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న వారి సంఖ్య మహిళల్లో ఇటీవల తీవ్రంగా పెరుగుతోందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. పురుషుల కంటే మహిళలే ఈ వ్యాధి బారిన ఎక్కువగా బాధపడుతున్నారని అందుకు పలురకాల కారణాలున్నాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. 2012-19 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 96 ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చిన 45,228 మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులపై ఎయిమ్స్ క్యాన్సర్ సెంటర్ వైద్యులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు, ఇందులో 34,395 మంది పురుషులు,10,833 మంది మహిళలు ఉన్నారు.

 

ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

వంటగదిలో వచ్చే పొగ వల్ల మహిళల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అనేక పరిశోధనలు వెల్లడించాయని ఈ అధ్యయనం చెబుతోంది. మరోవైపు, బయోమాస్ ఇంధనాన్ని వాడడం వల్ల 1,3-బ్యూటాడిన్, సైక్లోపెంటేన్, పైరీన్, ఆంత్రాసిన్ వంటి క్యాన్సర్ కలిగించే రసాయనాలు విడుదలవుతాయి.  

పాసివ్ స్మోకింగ్, వంటగది పొగ, పిడకలు వంటి బయోమాస్ ఇంధన పొగ దుష్ప్రభావాలు, వంటలో ఉపయోగించే బొగ్గు, కట్టెలు వంటి గ్రామీణ మారుమూల ప్రాంతాలలో మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణాలని అధ్యయనాలు చెబుతున్నాయి.

 

ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.