శరీరంలో బ్లడ్ లెవెల్స్ తగ్గితే ఏమౌతుంది..?
సాక్షి లైఫ్ : బ్లడ్ (రక్తం) అనేది శరీరంలోని ముఖ్యమైన జీవ పదార్థం. ఇది శరీరానికి జీవనం అందించడానికి, అవయవాలకు పోషకాలు, ఆక్సిజన్, ఇతర పదార్థాలను తరలించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో బ్లడ్ లెవెల్స్ తగ్గడాన్నే అనీమియా అంటారు. ఇది రక్తంలో ఎర్రరక్త కణాలు లేదా హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గినప్పుడు సంభవిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వివిధ అనారోగ్యాలతో పోరాడు తున్నారు. వారిలో చాలా మంది బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ను ఎదుర్కొంటూ ఉన్నారు. రక్త సంబంధిత వ్యాధులలో ప్రధానమైనది హిమోఫిలియా వ్యాధి ఒకటి. ఈ వ్యాధి బారినపడి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మిలియన్ల మంది చనిపోతున్నారు. హిమోఫిలియా గురించి మరిన్ని విషాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. బ్రకోలీని ఇలా తింటే10 రెట్లు ప్రయోజనాలు పొందవచ్చు..
ఇది కూడా చదవండి.. వాకింగ్ Vs రన్నింగ్.. ఏది బెటర్..?
ఇది కూడా చదవండి..కృత్రిమ చక్కెర వాడితే ఏమౌతుంది..?
కొందరిని ఈ వ్యాధి తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ సమస్యకు సరైన సమయంలో సరైన చికిత్స తీసుకోకపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం అని చెబుతున్నారు వైద్యనిపుణులు.
హిమోఫిలియా..
హిమోఫిలియా అనేది ఒక అరుదైన రక్త సంబంధిత వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన వ్యక్తులలో రక్తం గడ్డకట్టదు. ఎందుకంటే రక్తంలో గడ్డకట్టే ప్రోటీన్లు లేకపోవడం కారణంగా ఇలా జరుగుతుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) చెబుతోంది.
రక్తం కారుతుంది..
ఈ వ్యాధి ఉన్నవాళ్లు ఎలాంటి గాయాలు, దెబ్బలు, ప్రమాదాలు తగల కుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్లకు చిన్న గాయమైనా రక్తం కారుతూ ఉంటుంది. ఈ వ్యాధి శరీరం లోపల రక్తస్రావం కలిగిస్తుంది. హీమోఫిలియా వల్ల మోకాళ్లు, చీలమండలు, మోచేతులలో బ్లీడింగ్ అవ్వొచ్చు. శరీరంలోపల బ్లీడింగ్ అవ్వడం వల్ల బాడీ లోని అవయవాలు, కణజాలాలు దెబ్బతింటాయి. ఇలా జరిగితే మనిషి ప్రాణాలకే ప్రమాదం జరగవచ్చు. కనుక ఈ వ్యాధి వచ్చినవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కారణాలు ఏమిటి..?
హిమోఫిలియా అనేది జన్యుపరమైన వ్యాధి. ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్లనే ఎక్కువగా వస్తుంది. 40 ఏళ్లు పైబడినవారు, వృద్ధులను ఈ వ్యాధి తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. హిమోఫిలియా వచ్చిన వారిలో జన్యువులలో మార్పులు జరుగుతాయి. ఫలితంగా రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్రోటీన్ అందుబాటులో ఉండదు. ఒకవేళ హిమోఫిలియా కుటుంబంలో ఎవరికైనా ఉంటే, ఆయా ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ మహమ్మారి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. హిమోఫిలియాను ముందుగా స్క్రీనింగ్ ద్వారా గుర్తించి చికిత్స చేస్తే కొంతమేర కంట్రోల్ అవుతుంది.
హిమోఫిలియా లక్షణాలు ఎలా ఉంటాయంటే..?
బ్లీడింగ్ అవుతుంది.
మలంలో కానీ మూత్రంలో కానీ రక్తం
కీళ్ల వాపు, నొప్పి
ముక్కు నుంచి బ్లీడింగ్ అవ్వడం
బ్రెయిన్ లో బ్లీడింగ్ అవ్వడం
అప్పుడప్పుడు వాంతులు అవ్వడం
చాలా కాలంగా తలనొప్పిగా అనిపించడం
బలహీనంగా అనిపించడం
ఇది కూడా చదవండి..ఎంపాక్స్ ని నివారించే మార్గాలు..
ఇది కూడా చదవండి..ఇలాంటి జాగ్రత్తలు లేకపోతేనే మధుమేహ సమస్య వస్తుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
